Devara Collections : టార్గెట్ ఫినిష్.. 500 కోట్ల ‘దేవర’.. సోలో హీరోగా ఎన్టీఆర్ ఫస్ట్ భారీ రికార్డ్..

దేవర రిలీజ్ కి ముందే 500 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో దిగగా ఇప్పుడు టార్గెట్ ఫినిష్ అయిందని అంటున్నారు.

Devara Collections : టార్గెట్ ఫినిష్.. 500 కోట్ల ‘దేవర’.. సోలో హీరోగా ఎన్టీఆర్ ఫస్ట్ భారీ రికార్డ్..

NTR Devara Movie Collects 500 Crores Gross Worldwide Creates Records

Updated On : October 13, 2024 / 11:37 AM IST

Devara Collections : ఎన్టీఆర్ దేవర సినిమా ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించి కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. దసరా హాలిడేస్ ఉండటంతో ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో సందడి చేస్తుంది. తాజాగా దేవర 500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

Also Read : HariHara VeeraMallu : హరిహర వీరమల్లు షూటింగ్ కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే.. వరుస అప్డేట్స్ తో పవన్ ఫ్యాన్స్ కి పండగే..

దేవర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వారం రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 405 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను రాబట్టింది. తాజాగా 16 రోజుల్లో దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు ప్రకటించారు. దీంతో మూవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుండగా ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

దేవర రిలీజ్ కి ముందే 500 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో దిగగా ఇప్పుడు టార్గెట్ ఫినిష్ అయిందని అంటున్నారు. దేవర థియేట్రికల్ బిజినెస్ 180 కోట్లకు జరిగింది. అంటే ఈ సినిమా కనీసం 400 కోట్లు గ్రాస్ వసూలు చేస్తే హిట్ అయినట్టు. ఇప్పుడు 500 కోట్లు గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఇప్పటికే దేవర మూవీ యూనిట్ సక్సెస్ పార్టీ చేసుకుంది. ఎన్టీఆర్ సోలో హీరోగా 500 కోట్లు రాబట్టడం ఇదే మొదటిసారి. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలపై కూడా భారీ అంచనాలు నెలకొంటున్నాయి.