డిజాస్టర్ నెంబర్ -3
అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమాల తర్వాత, టాలీవుడ్‌లో మూడవ డిజాస్టర్‌గా ఎన్టీఆర్ కథానాయకుడు.

అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమాల తర్వాత, టాలీవుడ్‌లో మూడవ డిజాస్టర్‌గా ఎన్టీఆర్ కథానాయకుడు.
నటసింహ నందమూరి బాలకృష్ణ, తన తండ్రి, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథకి వెండితెర రూపమిస్తూ, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు పార్ట్‌లుగా తెరకెక్కించగా, ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా, భారీ అంచనాల మధ్య, జనవరి 9న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బాలయ్య వేసిన పలు గెటప్స్ బాగున్నాయనీ, తండ్రి పాత్రలో ఒదిగిపోయాడనీ, ఎన్టీఆర్‌కి బాలయ్య ఇచ్చే ఘనమైన నివాళి ఇదే అంటూ ప్రశంసలు వచ్చాయి. కట్ చేస్తే కలెక్షన్‌ల రూపంలో గట్టి షాకే తగిలింది. దాదాపు రూ.71 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, రూ.20 కోట్లకు మించి కలెక్ట్ చెయ్యలేకపోవడం మరీ దారుణం. ఏరీయాల వారీగా ఎన్టీఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలెక్షన్‌లు ఇలా ఉన్నాయి.
నైజాం : రూ. 3.90 కోట్లు, సీడెడ్ : రూ.1.80 కోట్లు, ఉత్తరాంధ్ర : రూ. 1.98 కోట్లు, కృష్ణా : రూ. 1.40 కోట్లు, ఈస్ట్ : రూ. 1.14 కోట్లు, వెస్ట్ : రూ. 1.35 కోట్లు, గుంటూరు : రూ. 2.90 కోట్లు, నెల్లూరు : రూ. 0.90 కోట్లు, ఏపీ, తెలంగాణా : రూ. 15.37 కోట్లు. రెస్టాఫ్ ఇండియా : రూ. 1.50 కోట్లు.. ఓవర్సీస్ : రూ. 3.75 కోట్లు.. టోటల్ : రూ. 20.62 కోట్లు..
దాదాపు రూ.50 కోట్ల మేర నష్టాలు తెచ్చిందీ సినిమా.. అజ్ఞాతవాసి, స్పైడర్ సినిమాల తర్వాత, టాలీవుడ్‌లో మూడవ డిజాస్టర్‌గా ఎన్టీఆర్ కథానాయకుడు నిలవడం ఆశ్చర్యమనే చెప్పాలి.
వాచ్ ట్రైలర్…