Vetrimaaran : నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..!

ఏకంగా ఐదు నేషనల్ అవార్డ్స్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెట్రి మారన్‌తో ఎన్టీఆర్ తన 32వ సిినిమా చెయ్యబోతున్నారు..

Vetrimaaran : నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్..!

Ntr 32

Updated On : September 12, 2021 / 4:48 PM IST

Vetrimaaran: యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఆ సినిమా జరుగుతుండగానే కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే NTR 30 సినిమా అనౌన్స్ చేశారు.

MAA Elections 2021 : ‘మా’ సభ్యులకు ప్రకాష్ రాజ్ విందు.. కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్..

ఇంతలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో తో బుల్లితెర మీద బిజీ అయిపోయారు తారక్. కొరటాల సినిమా తర్వాత ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ఇప్పుడు ‘సలార్’ తో సందడి చేయబోతున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ బ్యానర్లో మూవీ చెయ్యబోతున్నారని తెలిసింది.

MAA Elections 2021 : బండ్ల గణేష్‌కు ప్రకాష్ రాజ్, జీవిత సెటైర్..

జూనియర్ కొత్త సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. పాపులర్ తమిళ్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ వెట్రి మారన్‌తో తారక్ సినిమా చెయ్యబోతున్నారట. యంగ్ టైగర్ నటించబోయే 32వ సినిమా ఇది.

NTR 30 : తారక్ – కొరటాల క్రేజీ కాంబినేషన్.. వన్స్ మోర్!..

తమిళనాట టాలెంటెడ్ రైటర్, డైరెక్టర్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న వెట్రిమారన్ ధనుష్‌తో నాలుగో సినిమా ‘అసురన్’ ఏ రేంజ్ సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పటి వరకు ఏకంగా ఐదు నేషనల్ అవార్డ్స్ అందుకున్నారాయన.

Vetrimaaran

 

ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టు ఓ బ్రహ్మాండమైన కథ రెడీ చేశారట ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద దానయ్య నిర్మించనున్నారని సమాచారం. దర్శకుడిగా వెట్రి మారన్ ప్రస్తుతం ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతితో ‘విడుదలై’, వెర్సటైల్ యాక్టర్ సూర్యతో ‘వాడివాసల్’ సినిమాలు చేస్తున్నారు.

Laal Singh Chaddha : నాగ చైతన్య క్యారెక్టర్ నేను చెయ్యాల్సింది..