Vakkantham Vamsi : ఎన్టీఆర్ నన్ను దర్శకుడిని చేస్తానని మాటిచ్చాడు.. కానీ.. ఆ సినిమా ఆ హీరోతో చేయాల్సొచ్చింది.. వక్కంతం వంశీ!

వక్కంతం వంశీ తెలుగుతెరపై స్క్రీన్ రైటర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎక్కువుగా సురేందర్ రెడ్డి సినిమాలకు వంశీ కథలు అందించేవాడు. ఆ తరువాత మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడి గాను అదృష్టం పరీక్షించుకున్నాడు. తాజాగా ఈ స్టార్ రైటర్ 'అలీతో సరదాగా' టాక్ షోకి వచ్చాడు. ఈ కారిక్రమంలో తాను ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, ఇంకా తన జీవితంలోని ఎన్నో విషయాలను ఈ షోలో బయటపెట్టాడు.

Vakkantham Vamsi : ఎన్టీఆర్ నన్ను దర్శకుడిని చేస్తానని మాటిచ్చాడు.. కానీ.. ఆ సినిమా ఆ హీరోతో చేయాల్సొచ్చింది.. వక్కంతం వంశీ!

NTR promises to introduce Vakkantham Vamsi as a director

Updated On : November 18, 2022 / 1:18 PM IST

Vakkantham Vamsi : వక్కంతం వంశీ తెలుగుతెరపై స్క్రీన్ రైటర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎక్కువుగా సురేందర్ రెడ్డి సినిమాలకు వంశీ కథలు అందించేవాడు. ఆ తరువాత మెగా ఫోన్ పట్టుకొని దర్శకుడి గాను అదృష్టం పరీక్షించుకున్నాడు. తాజాగా ఈ స్టార్ రైటర్ ‘అలీతో సరదాగా’ టాక్ షోకి వచ్చాడు. ఈ కారిక్రమంలో తాను ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, ఇంకా తన జీవితంలోని ఎన్నో విషయాలను ఈ షోలో బయటపెట్టాడు.

Agent Movie: సంక్రాంతి బరిలోనే అఖిల్ ‘ఏజెంట్’.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్

అయితే వంశీ రైటర్, డైరెక్టర్ గానే కాదు హీరోగా కూడా ఒక సినిమా చేశాడు. దాసరి నారాయణ దర్శకత్వంలో యాంకర్ సుమ హీరోయిన్ గా, వక్కంతం వంశీ హీరోగా ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ అనే చిత్రం తెరకెక్కించిన విషయాన్ని అలీ గుర్తు చేశాడు. ఇక తనకి రచయితగా మంచి గురింపు తెచ్చిపెట్టింది రవితేజ నటించిన ‘కిక్’ సినిమా అని తెలియజేశాడు వంశీ.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కి టెంపర్ కథ చెప్పినప్పుడు నేను ఆ కథకి సెట్ అవుతానా అని తారక్ అడిగినట్లు చెప్పాడు. కానీ ఆ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే మైల్ స్టోన్ గా మారిపోయింది. అలాగే వక్కంతం వంశీని దర్శకుడిని చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చాడట, కానీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మాత్రం ఆయనతో కుదరలా. ఆ తరువాత అది అల్లు అర్జున్ తో తీసినట్లు వెల్లడించాడు వంశీ. ప్రస్తుతం మళ్ళీ రైటర్ గానే కెరీర్ ని ముందుకు సాగిస్తున్నాడు. అఖిల్, సురేందర్ రెడ్డి సినిమా ‘ఏజెంట్’కి కథని అందిస్తున్నాడు.