NTR – Rishab Shetty : కాంతార 2లో ఎన్టీఆర్.. రిషబ్ ప్లాన్ చేస్తే నేను రెడీ..

రిషబ్ శెట్టి కాంతార 2 సినిమాలో మీరు నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడగ్గా ఎన్టీఆర్ స్పందిస్తూ..

NTR – Rishab Shetty : కాంతార 2లో ఎన్టీఆర్.. రిషబ్ ప్లాన్ చేస్తే నేను రెడీ..

NTR Reacts on Guest Appearance in Rishab Shetty Kanthara 2 Rumours

Updated On : September 1, 2024 / 5:09 PM IST

NTR – Rishab Shetty : ఎన్టీఆర్ త్వరలో దేవర సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత వార్ 2, ఆ తర్వాత నీల్ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఎన్టీఆర్ నిన్నటి నుంచి ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని పలు ఆలయాలని సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలో కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా ఎన్టీఆర్ తో కలిసి తిరుగుతున్నాడు.

ఎన్టీఆర్, రిషబ్ ఫ్యామిలీలతో కలిసి కర్ణాటకలోని ఆలయాలని సందర్శిస్తున్నారు. ఇవాళ ఉదయం కొల్లూరులో శ్రీ మూకాంబిక ఆలయంలో ఈ రెండు ఫ్యామిలీలు పూజలు నిర్వహించారు. అనంతరం బయటకు వచ్చి ఎన్టీఆర్, రిషబ్ మీడియాతో మాట్లాడారు. అయితే అక్కడి రిపోర్టర్లు రిషబ్ శెట్టి కాంతార 2 సినిమాలో మీరు నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి నిజమేనా అని అడగ్గా ఎన్టీఆర్ స్పందిస్తూ.. రిషబ్ నిజంగా అలాంటిదేమైనా ప్లాన్ చేస్తే నేను అందుకు రెడీ అని అన్నారు.

Also Read : NTR – Neel : బీచ్‌లో ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్..

దీంతో ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నిజంగానే ఎన్టీఆర్ కాంతార 2లో గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తాడా? లేదా ఇప్పుడు ఎన్టీఆర్ రెడీ అన్నందుకు అయినా రిషబ్ స్పెషల్ అప్పీరెన్స్ ఎన్టీఆర్ కోసం రాస్తాడా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాంతార 2లో ఎన్టీఆర్ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తే బాగుండు అని భావిస్తున్నారు. మరి ఈ ఇద్దరూ ఏం ప్లాన్ చేసారో చూడాలి.