Om Raut : అతను తీసే రామాయణానికి నా మద్దతు ఉంటుంది.. రామాయణంపై ఇంకా సినిమాలు రావాలి.. ఓం రౌత్ వ్యాఖ్యలు..
దంగల్, చిచోరే.. లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ నితేశ్ తివారి ఇటీవల రామాయణం తీస్తానని ప్రకటించారు. రణబీర్ కపూర్ రాముడిగా, అలియా భట్ సీతగా తెరకెక్కిస్తానని ప్రకటించారు.

Om Raut supports to Nitesh Tiwari Ramayanam and he waiting for that movie
Nitesh Tiwari : ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) రాముడిగా వచ్చిన ఆదిపురుష్(Adipurush) సినిమా తాజాగా రిలీజయిన సంగతి తెలిసిందే. ఓ పక్క కలెక్షన్స్ వస్తూనే మరో పక్క వివాదాల్లో కూడా మునుగుతుంది. ఆదిపురుష్ సినిమా రోజుకొక కొత్త వివాదం తీసుకొస్తుంది. ఇక ఈ సినిమా డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ మాట్లాడే మాటలు కూడా వివాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా ఓం రౌత్ రామాయణంపై రాబోయే మరో సినిమా గురించి వ్యాఖ్యలు చేశారు.
దంగల్, చిచోరే.. లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ నితేశ్ తివారి ఇటీవల రామాయణం తీస్తానని ప్రకటించారు. రణబీర్ కపూర్ రాముడిగా, అలియా భట్ సీతగా తెరకెక్కిస్తానని ప్రకటించారు. ఇందులో సౌత్ యాక్టర్స్ ని కూడా తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా ఆదిపురుష్ ఇష్యూ నడుస్తుండటంతో ఓ ఇంటర్వ్యూలో ఓంరౌత్ ని నితీశ్ తివారి తీసే రామాయణం గురించి అడిగారు.
దీంతో నితేశ్ తివారి తీసే రామాయణం పై ఓం రౌత్ మాట్లాడుతూ.. నితేశ్ తివారి గొప్ప దర్శకుడు. నాకు మంచి స్నేహితుడు కూడా. అతని దంగల్ సినిమా మన దేశ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి. నితేశ్ రచనలు, దర్శకత్వం అద్భుతంగా అంటుంది. నితేశ్ రామాయణంపై సినిమా తీస్తాను అని ప్రకటించారు. అందరి రామ భక్తులలాగే నేను కూడా నితేశ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. రాముడిపై ఎవరైనా, ఎన్ని సినిమాలైనా తీయొచ్చు. రాముడి కథను ఎక్కువ మంది చెప్తే ఇంకా మంచిది. నితేశ్ తీసే రామాయణం కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను అని వ్యాఖ్యానించారు. మరి బాలీవుడ్ లో నితేశ్ తీసే ఈ రామాయణం ఎలా ఉంటుందో, ఇది ఎప్పుడొస్తుందో చూడాలి.