Priyanka Chopra : ప్రియాంక చోప్రా పై పాకిస్తానీ నటుడు ఫైర్.. ఎందుకో తెలుసా?
మీ విషయంలో భారతీయ జాతీయవాదం కాకుండా ఏషియన్ ఫీలింగ్ ఎందుకు రాదు అంటూ ప్రియాంక చోప్రా పై పాకిస్తానీ నటుడు ఫైర్. అసలు విషయం ఏంటి?

Pakistan actor Adnan Siddiqui fires on Priyanka Chopra post on Sharmeen Obaid Chinoy
Priyanka Chopra : స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడే వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతుంది. ఇక ఇటీవల ఈ అమ్మడి పేరు మీడియాలో మాటిమాటికి వినిపిస్తుంది. రీసెంట్ గా అమెరికాలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి హాట్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువ జరుగుతుంటాయని, అవి తట్టుకోలేకే అక్కడి నుంచి వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు బి-టౌన్ లో సంచలనంగా మారాయి. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ పాకిస్తానీ నటుడి మనోభావాలను దెబ్బతీశాయట.
NTR – Allu Arjun : మరో బాలీవుడ్ సినిమా కోసం అల్లు అర్జున్, ఎన్టీఆర్.. రణ్‌వీర్ సింగ్‌ని కాదని!
పాకిస్తానీ యాక్టర్ అద్నాన్ సిద్ధిఖీ (Adnan Siddiqui) గతంలో శ్రీదేవి మామ్ (Mom) సినిమాలో నటించి ఇండియన్ ఆడియన్స్ కూడా పరిచమైన వ్యక్తే. కాగా పాకిస్తాన్ కి చెందిన షర్మీన్ ఒబైద్ చినోయ్ (Sharmeen Obaid Chinoy) అనే దర్శకురాలు హాలీవుడ్ మూవీ స్టార్ వార్స్ ని తెరకెక్కించే అవకాశం అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చింది.. “స్టార్ వార్స్ (Star Wars) ని డైరెక్ట్ చేయబోతున్న మొదటి మహిళ షర్మీన్ ఒబైద్ చినోయ్ అండ్ ఆమె మన సౌత్ ఏషియన్ మహిళ. ఇది ఒక చారిత్రాత్మకమైన మూమెంట్. నాకు చాలా గర్వంగా ఉంది షర్మీన్” అంటూ వ్యాఖ్యానించింది.
ఈ పోస్ట్ కి పాకిస్తానీ యాక్టర్ అద్నాన్ సిద్ధిఖీ రెస్పాండ్ అవుతూ.. “ప్రియాంక చోప్రా మీరు మీ జ్ఞానాన్ని కోచెమ్ మెరుగు పరుచుకోవాలి. షర్మీన్ ఒబైద్ చినోయ్ ముందు ఒక పాకిస్తానీ, ఆ తరువాత ఒక సౌత్ ఏషియన్ మహిళ. మీ విషయంలో ఆ ఏషియన్ ఫీలింగ్ ఎందుకు రాదు. అవకాశం దొరికినప్పుడల్లా మీరు మీ భారతీయ జాతీయతను చాటుకునే ప్రయత్నం చేస్తుంటారుగా” అంటూ ప్రియాంక పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేశాడు.
With due respect, @priyankachopra . Sharmeen Obaid Chinoy is a Pakistani first just to brush up your knowledge. Much like the way you flaunt your Indian nationality whenever you get the opportunity before claiming to be a South Asian.?? pic.twitter.com/B7wy8gD8QB
— Adnan Siddiqui (@adnanactor) April 14, 2023