Gudumba Shankar Re-Release: ‘ఆరెంజ్’ రీ-రిలీజ్ బ్లాక్‌బస్టర్.. లైన్ కడుతున్న గుడుంబా శంకర్..!
ఇటీవల రీ-రిలీజ్ చిత్రాల జోరు బాగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కోవలో మహేష్ బాబు ‘పోకిరి’, పవన్ కల్యాణ్ ‘జల్సా’ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాను థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Pawan Kalyan Gudumba Shankar To Get Re-Release
Gudumba Shankar: ఇటీవల రీ-రిలీజ్ చిత్రాల జోరు బాగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కోవలో మహేష్ బాబు ‘పోకిరి’, పవన్ కల్యాణ్ ‘జల్సా’ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉండగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాను కూడా రీ-రిలీజ్ చేశారు మేకర్స్.
Pawan Kalyan: ఏప్రిల్ మొత్తం బిజీబిజీ అంటోన్న పవన్..!
ఈ సినిమా రిలీజ్ సమయంలో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో, ఇప్పుడు ఈ సినిమా రీ-రిలీజ్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని అందరూ అనుకున్నారు. కానీ, అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఆరెంజ్ సినిమాకు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపడంతో ఆరెంజ్ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు వస్తున్నట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.
Orange Re Release : జనసేన కోసం చరణ్ బర్త్ డేకి ఆరెంజ్ రీ రిలీజ్..
ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి, ఇప్పుడు మరో మూవీ కూడా రీ-రిలీజ్‌కు రెడీ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాను థియేటర్లలో మళ్లీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ ఈ సినిమాతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. అందాల భామ మీరా జాస్మిన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా, మణిశర్మ సంగీతం అందించారు. మరి గుడుంబా శంకర్ సినిమాను ఎప్పుడు రీ-రిలీజ్ చేస్తారనే విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.