Hari Hara Veera Mallu : యాక్షన్ సీన్ లీక్..!

‘హరి హర వీరమల్లు’ సినిమాకి సంబంధించి పవన్ మల్ల యోధులతో ఫైట్ చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్ తాలుకు సీన్ ఒకటి లీక్ అయింది..

Hari Hara Veera Mallu : యాక్షన్ సీన్ లీక్..!

Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Action Scene Leaked

Updated On : June 29, 2021 / 4:13 PM IST

Hari Hara Veera Mallu: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ళ్యాణ్ 27వ సినిమా ‘హరి హర వీరమల్లు’ (Legendary Heroic Outlaw) క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది.. మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ.ఎం.ర‌త్నం దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పవన్ గెటప్, కాస్ట్యూమ్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్‌కి బాగా కేర్ తీసుకుంటున్నారు. ఇంతకుముందు సినిమాలకు ఆయన ఎంతలా కష్టపడ్డారో తెలిసిందే. ‘హరి హర వీరమల్లు’ లోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ట్రైనర్ సహాయంతో ట్రైనింగ్ అవుతున్న పవన్ పిక్స్ ఇటీవల వైరల్ అయ్యాయి.

Hari Hara Veera Mallu : డెడికేషన్ అంటే ఇదీ.. ‘హరి హర వీరమల్లు’ కోసం పవన్ ప్రాక్టీస్..

ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమాకి సంబంధించి పవన్ మల్ల యోధులతో ఫైట్ చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్ తాలుకు సీన్ ఒకటి లీక్ అయింది. పవర్ స్టార్ అదిరిపోయే రేంజ్‌లో ఫైట్ చేస్తున్న ఈ వీడియో లీక్ అయిన వెంటనే గమనించి మూవీ టీం జాగ్రత్తపడడంతో పెను ప్రమాదం తప్పింది. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.. అయినా ఫుటేజ్ ఎలా బయటకి వచ్చిందనేది తెలియక మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. 2022 సంక్రాంతికి ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ కానుంది.