హి ఈజ్ బ్యాక్ : పింక్ రీమేక్ ప్రారంభం
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ తెలుగు రీమేక్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ తెలుగు రీమేక్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న కొత్త సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బాలీవుడ్ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్‌లో పవన్ నటించనున్న సంగతి తెలిసిందే. హిందీలో అమితాబ్ చేసిన పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కనిపించనున్నారు. నటిస్తున్న 26వ సినిమా ఇది.
హిందీ, తమిళ్ బాషల్లో ‘పింక్’ చిత్రాన్ని నిర్మించిన బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, తెలుగులో దిల్ రాజుతో కలిసి నిర్మిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న 40వ సినిమా ఇది. ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎంసీఏ’ చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమాను డైరెక్ట్ చేయన్నారు. థమన్ సంగీతమందించనున్నారు. తాజాగా ఈ సినిమాను సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించలేదు. పవన్ కూడా హాజరుకాలేదు. బోనీ కపూర్, దిల్ రాజు, థమన్, వేణు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. 2020 జనవరి నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.