Bro Movie : బ్రో సినిమాలో పవన్ రన్ టైం ఎంతో తెలుసా..? పవన్ స్క్రీన్ పై కనిపించేది..
బ్రో సినిమాలో సాయి ధరమ్ మై లీడ్, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ రన్ టైం ఎంతో తెలుసా..?
Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలయికలో వస్తున్న మెగా మల్టీస్టారర్ చిత్రం బ్రో (Bro). తమిళ్ హిట్ మూవీ వినోదయ సిత్తంకి రీమేక్ గా వస్తున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కింది. ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. గతంలో ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ మోడరన్ దేవుడిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంతో ఆడియన్స్ ని బాగా అలరించిన పవన్.. ఇప్పుడు మళ్ళీ అదే తరహా పాత్రతో బ్రో మూవీలో కనిపిస్తుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
కాగా గోపాల గోపాల సినిమాలో వెంకటేష్ సినిమా మొత్తం ఉంటే పవన్ ఇంటర్వెల్ కి ముందు వచ్చి మూవీలో హాఫ్ టైం మాత్రమే కనిపిస్తాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో పవన్ పవన్ రన్ టైం ఎంత ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది. తాజాగా ఈ విషయం పై సాయి ధరమ్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ ఉన్న ఈ హీరో ఒక ప్రముఖ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో పవన్ రన్ టైం గురించి మాట్లాడుతూ.. సినిమాలో మొదటి 15 నిముషాలు మాత్రమే పవన్ కనిపించడని, ఆ తరువాత సినిమా ఎండ్ వరకు పవన్ పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Baby Movie : ఫస్ట్ డే కంటే నాలుగో రోజు కలెక్షన్స్ ఎక్కువ సాధించిన బేబీ.. ఎంతో తెలుసా..?
దీంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ పాత్రకి సంబంధించిన షూటింగ్ ని కూడా ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు అనేది తెలియజేశాడు. షూటింగ్ మొదలు పెట్టాక పవన్ రోల్ కి సంబంధించిన సీన్స్ ముందుగా చిత్రీకరించారు. మొత్తం 21 రోజుల్లో పవన్ పాత్ర షూట్ పూర్తి చేసినట్లు వెల్లడించాడు. కాగా ఈ తమిళ డైరెక్టర్ సముద్రఖని డైరెక్ట్ చేస్తుంటే మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.