కోలుకుంటున్న మార్క్ శంకర్.. తిరుమలకు పవన్ భార్య అన్నా కొణిదెల.. డిక్లరేషన్‌పై సంతకం
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో స్కూల్‌లో ఇటీవల అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి.

Anna Konidela
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల ఇవాళ తిరుమలకు చేరుకున్నారని జనసేన పార్టీ తెలిపింది. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో అన్నా కొణిదెల స్వామి వారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.
అన్నా కొణిదెల ఇవాళ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ మేరకు ఆమె టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు.
టీటీడీ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు శ్రీవారి దర్శనానికి వస్తే స్వామివారిపై నమ్మకం ఉందంటూ టీటీడీకి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్నా కొణిదెల గాయత్రి సదనంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఇవాళ రాత్రి ఆమె వరాహ స్వామిని దర్శించుకుంటారు.
కాగా, పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో స్కూల్‌లో ఇటీవల అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయి. మార్క్ శంకర్‌కు స్కూల్ సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ బాలుడు అనంతరం కోలుకున్నాడు. అతడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తిరుమలకు అన్నా కొణిదెల ఒక్కరే వెళ్లినట్లు తెలుస్తోంది.