Pawan Kalyan – OG : అర్ధరాత్రి పవన్ ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచిన OG నిర్మాణ సంస్థ.. ఇస్తామన్నది కూడా ఇవ్వట్లేదు..
OG నిర్మాణ సంస్థ అర్ధరాత్రి మరో ట్వీట్ చేసింది.
Pawan Kalyan – OG : నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే అంతా పవన్ మేనియానే. థియేటర్స్ లో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తో సందడి చేస్తున్నారు. ఇక పవన్ చేతిలో ఉన్న సినిమాల నుంచి ఏదో ఒకటి ఫ్యాన్స్ కోసం పోస్టర్స్ కానీ, గ్లింప్స్ కానీ ఇస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా నుంచి ఇవాళ 9 గంటల 9 నిమిషాలకు ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ కంటెంట్ ఇస్తామన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా ఏదో ఒకటి రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. అయితే అందరూ ఎదురుచూసే OG సినిమా నుంచి భారీగా ఆశించారు ఫ్యాన్స్. OG మూవీ యూనిట్ కూడా ఇద్దామనుకున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదల కారణంగా జనజీవనం అతలాకుతలం అవ్వడంతో పవన్ సెలబ్రేషన్స్ వాయిదా వేస్తున్నామని కేవలం OG పోస్టర్ ఒకటి రిలీజ్ చేసి, ఫస్ట్ సాంగ్ ఎప్పుడొస్తుందో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.
దీంతో ఫ్యాన్స్ సర్లే ఏదో ఒకటి అని సరిపెట్టుకుందామనుకున్నారు. కానీ OG నిర్మాణ సంస్థ అర్ధరాత్రి మరో ట్వీట్ చేసింది. తమ ట్వీట్ లో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరుస వర్షాలు, వరదల కారణంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే కంటెంట్ రేపు రిలీజ్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాం. OG సినిమా సెలబ్రేషన్ లాంటింది. ఈ సెలబ్రేషన్స్ ని ప్రస్తుతానికి వాయిదా వేసి త్వరలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అని తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. కనీసం ఒక బర్త్ డే విషెస్ పోస్టర్ అయినా రిలీజ్ చేయాల్సింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Due to the continuous rain and flood calamities in Andhra Pradesh and Telangana, we have decided to call off all birthday content releases tomorrow.
𝑶𝑮 is a film that will be celebrated for years to come ❤️
Let’s get through this together and celebrate in a big way soon. 🤗
— DVV Entertainment (@DVVMovies) September 1, 2024