Ustaad Bhagat Singh: పవన్ స్టెప్ వేస్తే.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ వీడియో.. క్రేజీ ఉందిగా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Ustaad Bhagat Singh: పవన్ స్టెప్ వేస్తే.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి స్పెషల్ వీడియో.. క్రేజీ ఉందిగా..

Pawan kalyan Ustaad Bhagat Singh special video released

Updated On : December 1, 2025 / 8:49 PM IST

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక ఓజీ తరువాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆ అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ కి ఆడియన్స్ నుంచి, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Vaishnavi Chaitanya: బ్లాక్ అవుట్ ఫిట్ లో వైష్ణవి చైతన్య.. ఎంత క్యూట్ ఉందో చూడండి

ఇక ఇటీవల హరీష్ శంకర్ ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ త్వరలో విడుదల అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే మ్యూజిక్ అందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చాడు. కానీ, సాంగ్ ఎప్పుడు విడుదల అవుతుంది అనేది మాత్రం చెప్పలేదు. ఇక అప్పటినుంచి పవన్ ఫ్యాన్స్ ఆ సింగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా సాంగ్ నుంచి ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు మేకర్స్. ఎలాంటి అప్డేట్ లేకుండా వచ్చిన ఈ సర్ప్రైజ్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక ఈ వీడియోలో బ్లాక్ సూట్ వేసుకొని కనిపించాడు పవన్ కళ్యాణ్. జస్ట్ సాంగ్ కి లా చిన్నగా కాలు కదిపాడు అంతే.. సోషల్ మీడియాలో మొత్తం షేక్ అయ్యింది. దానికి హరీష్ శంకర్ ఒక రేంజ్ ఓ రియాక్ట్ అయ్యాడు. కొన్ని సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ పాటలో చాలా రోజుల తరువాత ఒక రేంజ్ లో డాన్స్ చేయనున్నాడట పవన్ కళ్యాణ్. దీంతో ఈ త్వరలో విడుదల కాబోతున్న ఈ పాటపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే, ఈ సాంగ్ ఎప్పుడు విడుదల కానుంది అనేది మాత్రం ఇంకా చెప్పలేదు మేకర్స్. అప్పటివరకు పవన్ అలా కాలు కదిపిన వీడియోతో సరిపెట్టుకోవాల్సిందే.