Kannappa : కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్.. శివుడిగా కనిపించేందుకు మూడు రోజుల..

కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శివుడిగా కనిపించేందుకు మూడు రోజుల పాటు..

Kannappa : కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్.. శివుడిగా కనిపించేందుకు మూడు రోజుల..

Prabhas allocated dates for Manchu Vishnu Kannappa movie

Updated On : January 28, 2024 / 8:37 PM IST

Kannappa : మంచు విష్ణు నటిస్తున్న హిస్టారికల్ సోషియో ఫాంటసీ మూవీ ‘కన్నప్ప’. మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. వంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్.. శివుడిగా కనిపించబోతున్నారని సమాచారం. పార్వతి పాత్రలో నయనతార నటించబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ మూవీకి సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ని ఇటీవలే న్యూజిలాండ్ లో పూర్తి చేసుకొని వచ్చారు. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన షాట్స్ ని చిత్రీకరిస్తునట్లు సమాచారం. ఈక్రమంలోనే కైలాసంలోని శివపార్వతికి సంబంధించిన షాట్స్‌ని, అలాగే క్లైమాక్స్ కి సంబంధించిన సీన్స్ ని చిత్రీకరించడానికి సిద్దమయ్యారట. దీంతో శివుడిగా తన పాత్రని పూర్తి చేయడానికి ప్రభాస్.. ఒక మూడు రోజుల కాల్ షీట్స్ ని ఇచ్చారంట.

Also read : #90s Web Series : పాన్ ఇండియా లెవెల్‌లో.. 90s వెబ్ సిరీస్ స్ట్రీమింగ్.. ప్రమోషన్స్‌లో మౌళి..

ఫిబ్రవరి 17-19 తేదీలలో ప్రభాస్ ఈ మూవీ సెట్స్ లో పాల్గొని.. తనకి సంబంధించిన సన్నివేశాలని పూర్తి చేయబోతున్నారట. మరి అందరూ అనుకుంటున్నట్లు ప్రభాస్.. నిజంగానే శివుడి పాత్రలో కనిపించబోతున్నారా అనేది చూడాలి. కాగా ఈ సినిమాలో మంచు విష్ణుకి హీరోయిన్ గా ప్రీతీ ముఖుంధన్ నటిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే.. మంచు ఫ్యామిలీకి సంబంధించిన మూడు జనరేషన్ వ్యక్తులు ఈ కన్నప్పలో కనిపించబోతున్నారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే ఒక ముఖ్య పాత్రని కూడా పోషిస్తున్నారు. ఇక మోహన్ బాబు మనవడు, విష్ణు కుమారుడు ‘అవ్రామ్’ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడట. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.