‘బాహుబలి’ కంటే ముందు ‘శివ’ : వర్మ సినిమాపై ప్రభాస్ కామెంట్

‘బాహుబలి : ది బిగినింగ్’ స్క్రీనింగ్ తర్వాత ఓ ఇంగ్లీష్ డైలీకిచ్చిన ఇంటర్వూలో ప్రభాస్ ‘శివ’ సినిమా గురించి ప్రస్తావించాడు..

  • Published By: sekhar ,Published On : October 24, 2019 / 11:49 AM IST
‘బాహుబలి’ కంటే ముందు ‘శివ’ : వర్మ సినిమాపై ప్రభాస్ కామెంట్

Updated On : October 24, 2019 / 11:49 AM IST

‘బాహుబలి : ది బిగినింగ్’ స్క్రీనింగ్ తర్వాత ఓ ఇంగ్లీష్ డైలీకిచ్చిన ఇంటర్వూలో ప్రభాస్ ‘శివ’ సినిమా గురించి ప్రస్తావించాడు..

సినిమా పరిశ్రమలో ఒక హీరో వేరే సినిమా గురించి మాట్లాడితే అదో పెద్ద న్యూస్ అవుతుంది.. రీసెంట్‌గా ‘రెబల్ స్టార్’ ప్రభాస్, నాగార్జున, రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్‌లో వచ్చిన ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘శివ’ గురించి మాట్లాడాడు.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసిన ‘బాహుబలి : ది బిగినింగ్’.. ఈ సినిమాను అక్టోబర్ 19న లండన్‌లోని ప్రఖ్యాత ‘రాయల్ ఆల్బర్ట్ హాల్’ లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే..

రాజమౌళి, రమా రాజమౌళి, కీరవాణి, వల్లి, ప్రభాస్, రానా, అనుష్క, కాల భైరవ, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. స్క్రీనింగ్ అయిన తర్వాత మూవీ టీమ్ పలు నేషనల్ ఛానెల్స్‌కు ఇంటర్వూలు ఇచ్చారు. ఓ ఇంగ్లీష్ డైలీకిచ్చిన ఇంటర్వూలో ప్రభాస్ ‘శివ’ సినిమా గురించి ప్రస్తావించాడు..

Read Also : బాలయ్య దివాళీ ట్రీట్ రెడీ..

‘బాహుబలి’ కంటే ముందు తెలుగు సినిమాలేమైనా ఈ రేంజ్‌లో దేశవ్యాప్తంగా ప్రభావం చూపించాయా?’ అని ప్రభాస్‌ను రిపోర్టర్ అడగ్గా.. ‘30 సంవత్సరాల కిందట రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘శివ’ సినిమా దేశవ్యాప్తంగా తెలుగు సత్తాను చాటింది’.. అని ప్రభాస్ ఆన్సర్ ఇచ్చాడు.. ప్రభాస్ ‘శివ’ సినిమా గురించి మాట్లాడాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.