Prabhas : మూడు గంటల సినిమాలో ప్రభాస్‌కి మూడు నిముషాలు కూడా డైలాగ్స్ లేవుగా..

సలార్ సినిమా వచ్చిన దగ్గర్నుంచి ఎక్కువ వైరల్ అయిన విషయం ప్రభాస్ డైలాగ్స్.

Prabhas : మూడు గంటల సినిమాలో ప్రభాస్‌కి మూడు నిముషాలు కూడా డైలాగ్స్ లేవుగా..

Prabhas Dialogues Length in Salaar Movie Going Viral

Updated On : January 22, 2024 / 7:50 AM IST

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్(Salaar) సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా దాదాపు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సలార్ చూసిన తర్వాత ప్రేక్షకులకు ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం పార్ట్ 2 లోనే దొరుకుతుంది.

అయితే సలార్ సినిమా వచ్చిన దగ్గర్నుంచి ఎక్కువ వైరల్ అయిన విషయం ప్రభాస్ డైలాగ్స్. ఒక స్టార్ హీరో సినిమా అంటే సినిమాలో ఎక్కువ సేపు కనపడేది, ఎక్కువ మాట్లాడేది అతనే. అభిమానుల కోసం పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా ఉంటాయి. కానీ సలార్ సినిమాలో దీనికి పూర్తిగా విరుద్దంగా జరిగింది. సలార్ సినిమాలో ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడాడు అని కంప్లైంట్ ఆల్రెడీ వచ్చింది. ఈ ఒక్క విషయంలో మాత్రం అభిమానులు నిరాశ చెందారు. అంతకుముందు ఎప్పుడు ప్రభాస్ ఏ సినిమాలోనూ ఇంత తక్కువ మాట్లాడలేదు.

Also Read : Sohel : నా సినిమా సపోర్ట్ కోసం యువ హీరోలను అడిగితే.. కనీసం రెస్పాండ్ అవ్వలేదు.. సోహైల్ సంచలన వ్యాఖ్యలు..

ప్రస్తుతం సలార్ నెట్ ఫ్లిక్స్ ఓటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో కొంతమంది సినిమా మొత్తం ప్రభాస్ మాట్లాడిన డైలాగ్స్ తీసి ఒక వీడియో చేయగా ఇది కేవలం 2 నిమిషాల 33 సెకండ్స్ ఉంది. సలార్ సినిమా లెంగ్త్ దాదాపు 3 గంటలు. మూడు గంటల స్టార్ హీరో సినిమాలో ప్రభాస్ కనీసం మూడు నిముషాలు కూడా మాట్లాడలేదని ప్రస్తుతం వైరల్ అవుతుంది. హీరో మాట్లాడకపోయినా అతనికి ఇచ్చే ఎలివేషన్స్ తో సినిమా నడిపించాడు ప్రశాంత్ నీల్. ఇది ఒక రకంగా కొత్త ప్రయోగం అనే చెప్పొచ్చు. మరి సలార్ పార్ట్ 2 లో అయినా ప్రభాస్ కి డైలాగ్స్ ఉంటాయా? లేకపోతే అప్పుడు కూడా ఇంతే తక్కువగా మాట్లాడతాడా చూడాలి.