Kalki 2898 AD : ఇటలీ నుంచి షూటింగ్ ఫోటో షేర్ చేసిన ‘కల్కి’ మూవీ టీం..
ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. తాజాగా చిత్ర యూనిట్ అక్కడి నుంచి ఓ కొత్త ఫోటోని షేర్ చేసింది.

Prabhas Kalki 2898 AD movie shooting held at italy photo gone viral
Kalki 2898 AD : ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ టు బాలీవుడ్ ఆడియన్స్ వరకు ప్రతిఒక్కరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ హిందూ పురాణాల్లోని పాత్రలను మోడరన్ సూట్స్ లో చూపించి ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నారు.
మే నెలలో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీలోని చివరి సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ చిత్రకరణ ఇటలీలోని సముద్రం ఒడ్డున జరుగుతుంది. ప్రభాస్ అండ్ దిశా పటాని పై ఈ పాటని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఆ షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు బయటకి రాగా, తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్ ఓ కొత్త ఫోటోని షేర్ చేసింది.
Also read : Sandeep Reddy Vanga : కొత్త లుక్‌లో సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ ‘స్పిరిట్’ గురించి కామెంట్స్..
ఆ ఫొటోలో ప్రభాస్, దిశా పటానితో పాటు మొత్తం చిత్ర యూనిట్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో దీపికా పదుకోన్ కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక కమల్ హాసన్ విలన్ గా నటిస్తుంటే అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఓ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ వంటి తారలు కూడా కొన్ని ముఖ్య పాత్రల్లో చేస్తున్నట్లు సమాచారం.
Italy lo aata paata ???? #Kalki2898AD pic.twitter.com/NTEio4vIu5
— Kalki 2898 AD (@Kalki2898AD) March 6, 2024
ఇది ఇలా ఉంటే, ఈ శుక్రవారం శివరాత్రి సందర్భంగా మూవీ నుంచి టీజర్ లేదా సాంగ్ అప్డేట్ రానుందట. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఓ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యింది. ఆ చిన్న గ్లింప్స్ తోనే ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసిన మూవీ టీం.. టీజర్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.