Prabhas : మలయాళం స్టార్ హీరో దర్శకత్వంలో ప్రభాస్? ఇంకో సినిమా లైన్లో పెట్టాడా?

మలయాళ నటుడు, డైరెక్టర్ అయిన పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా ఓకే అయినట్టు వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ లో పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు.

Prabhas : మలయాళం స్టార్ హీరో దర్శకత్వంలో ప్రభాస్? ఇంకో సినిమా లైన్లో పెట్టాడా?

Prabhas said ok to Movie under Malayalam Star Hero Pruthviraj Sukumaran Direction

Updated On : July 27, 2023 / 11:23 AM IST

Prabhas :  3 సినిమాలతో ఇప్పటికే షటిల్ సర్వీస్ చేస్తూ మరో రెండు సినిమాలని చేతిలో పెట్టుకున్న ప్రభాస్ లేటెస్ట్ గా ఇంకో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారు. స్టోరీ తనకి నచ్చితే చాలు డైరెక్టర్ ఎవరన్నది చూడకుండా సినిమాలకు ఓకే చెప్పేస్తున్న ప్రభాస్ తన సినిమాలో విలన్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడా బ్రేక్ లేకుండా నచ్చిన సినిమాని నాన్ స్టాప్ గా చేస్తున్నారు. ఇప్పటికే సలార్, కల్కి, మారుతి దర్శకత్వంలో సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ సందీప్ రెడ్డి స్పిరిట్ ని స్టాండ్ బైలో ఉంచారు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమాకి రెడీ అవుతున్నట్టు న్యూస్ వినిపిస్తోంది.

మలయాళ నటుడు, డైరెక్టర్ అయిన పృధ్విరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా ఓకే అయినట్టు వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ లో పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. పృధ్విరాజ్ పొటెన్షియల్ డైరెక్టర్ గా పేరుంది. అంతకముందు చేసిన లూసిఫర్, బ్రో డాడీ లాంటి సినిమాల్లో నటిస్తూ డైరెక్ట్ చేశారు పృధ్విరాజ్. ఈ సనిమాలు సౌత్ మొత్తం మంచి హిట్ అవ్వడంతో పృధ్విరాజ్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.

Bro Movie : మొన్నటిదాకా హైప్ లేదు.. పవన్ ఎంట్రీతో ‘బ్రో’పై పెరిగిన అంచనాలు.. రేపే రిలీజ్..

దాంతో ప్రభాస్ రేంజ్ కి, ఇమేజ్ కి తగినట్టు సాలిడ్ స్టోరీతో పృధ్విరాజ్ స్టోరీ రెడీ చేసినట్టు, ఆల్రెడీ ప్రభాస్ కి స్టోరీ కూడా చెప్పినట్టు టాక్. ఈ మధ్య జానర్ ఏదైనా సరే స్టోరీకి ఇంప్రెస్ అవుతున్న ప్రభాస్ డైరెక్టర్ ఎవరైనా సరే ఓకే చెప్పేస్తున్నారు. అలాగే పృధ్విరాజ్ తో ప్రభాస్ సినిమా ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయినట్టే తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ పాన్ వరల్డ్ లెవల్లో కల్కి మూవీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నెక్ట్స్ సమ్మర్ కి బరిలోకి దిగబోతున్న కల్కి రిలీజ్ అయ్యాక పృధ్విరాజ్ తో ప్రభాస్ సినిమా స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. దీంతో మరోసారి ప్రభాస్ లైనప్ చర్చగా మారింది.