Prabhas : ప్రభాస్ తో ఇంత క్లోజ్ గా, సరదాగా మాట్లాడేస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? వీడియో వైరల్..
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి బాగా క్లోజ్ గా నవ్వుతూ, సరదాగా మాట్లాడింది. (Prabhas)
Prabhas
Prabhas : ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడతాడు, ఎవరితో ఎక్కువ కలవడు అని అందరికి తెలిసిందే. అందులోను అమ్మాయిలతో మాట్లాడటం చాలా అరుదు. బయట కూడా ప్రభాస్ సిగ్గుతోనే మాటలు తక్కువగా మాట్లాడతాడు. అయితే ఇటీవల జరిగిన రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ ఓ అమ్మాయితో క్లోజ్ గా, సరదాగా మాట్లాడాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.(Prabhas)
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి బాగా క్లోజ్ గా నవ్వుతూ, సరదాగా మాట్లాడింది. ప్రభాస్ కూడా అంతే సరదాగా మాట్లాడాడు. దీంతో ప్రభాస్ తో ఇంత క్లోజ్ గా మాట్లాడింది ఎవరా అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు.
Also Read : Ravikrishna : నా కులం తెలిసి మూడు సినిమాల్లో నన్ను తీసేసారు.. రవికృష్ణ సంచలన వ్యాఖ్యలు..
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు. రాజాసాబ్ డైరెక్టర్ మారుతి కూతురు ‘హియ దాసరి’. హియ దాసరి కూడా సినిమా రంగంలోకి వచ్చింది. హియ ఆల్రెడీ కొన్ని మ్యూజిక్ బ్యాండ్స్ తో ఓ ప్రోగ్రాం చేసింది. అలాగే రాజాసాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది. నాగ్ అశ్విన్ దగ్గర పనిచేయాలని ఆమె కోరిక. మరి ఫ్యూచర్ లో హియ దాసరి కూడా నాన్న లాగే డైరెక్టర్ అవుతుందేమో చూడాలి.
రాజాసాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడంతో హియ ప్రభాస్ కి కూడా బాగా దగ్గరైంది. ఆ చనువుతోనే సినిమా ఈవెంట్లో ఇలా ప్రభాస్ తో మాట్లాడి మారుతీ కూతురు హియ వైరల్ అయింది. ఈ వీడియో స్వయంగా హియనే షేర్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.
Also Read : Nandu : ఆ మాటలు నన్ను బాధపెట్టాయి.. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.. ఆరోపణలపై స్పందించిన నందు..
ఇక మారుతీ కొడుకు మ్యూజిక్ వైపు వెళ్తున్నాడు. ప్రస్తుతం డ్రమ్మర్స్, పియానో ప్లే చేస్తున్నాడు అని గతంలో హియ తెలిపింది.
