MAA Association: మా ఎన్నికల్లో బయట వ్యక్తులు.. కాసేపట్లో వీడియోలు

‘మా’ ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినా కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపణలు ఆగట్లేదు.

MAA Association: మా ఎన్నికల్లో బయట వ్యక్తులు.. కాసేపట్లో వీడియోలు

Prakash Raj

Updated On : October 22, 2021 / 1:15 PM IST

MAA Association: ‘మా’ ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు ముగిసి, అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేసినా కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపణలు ఆగట్లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రకాశ్‌ రాజ్‌, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు మీడియా ముందుకు వచ్చిన రాజీనామా కూడా చేశారు.

ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలంటూ ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ను కూడా కోరారు. పోలీసుల ద్వారా సీసీ ఫుటేజ్ తీసుకుని, తర్వాత పరిశీలించిన ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ప్యానెల్ అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు.

మా ఎన్నికలు జరుగుతున్న సమయంలో బయటి వ్యక్తులు అక్కడకు వచ్చారని, బయట వ్యక్తులు అక్కడ ఇబ్బందులు పెట్టారంటూ.. అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నట్లు చెప్పారు. రౌడీ షీటర్ నూకల సాంబశివరావు కూడా ఆ ప్రదేశంలో ఉన్నారని, అందుకు సంబంధించిన వీడియోలు కాసేపట్లో విడుదల చేయనున్నట్లు ప్రకాష్ రాజ్ చెప్పారు.