MAA Elections : నరేష్ కౌగిలి వెనుక చాలా అర్థాలుంటాయి- ప్రకాశ్ రాజ్
ముఖంలో నవ్వు చూపిస్తూ అంతా బానే జరుగుతోందని కవర్ చేశారు. ఐతే.. లోపల మాత్రం మంటలు అలాగే కొనసాగుతోందనే విషయం అర్థమయ్యేలా కొన్ని కామెంట్స్ చేశారు.

Prakash Raj
MAA Elections : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఎప్పుడూ నవ్వుతూ.. కనిపించే కొందరు సినీతారలు… పోలింగ్ సెంటర్లో కోపంగా కనిపించారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రధానంగా… ప్రకాశ్ రాజ్, విష్ణు ప్యానెల్ కీలక మద్దతుదారు నరేశ్ మధ్య డైలాగ్ వార్ వాతావరణాన్ని వేడిగా మార్చేసింది.
MAA Elections 2021 : ‘మా’ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
ఎన్నికలు ఇలాగేనా జరిపేది… ఇలా ప్రలోభపెట్టి ఓట్లు పొందడం కూడా గెలుపేనా అంటూ ప్రకాశ్ రాజ్ .. నరేశ్ ను ఉద్దేశించి మాట్లాడినట్టు తెలిసింది. ఇదే సందర్భంలో.. రెండు ప్యానెళ్ల సభ్యుల మధ్య డైలాగ్ వార్ జరిగింది. ఒకరిపై మరొకరు మాటలతో దుమ్మెత్తిపోసుకున్నారు. అందరి ముఖాలు కూడా ఎరుపెక్కాయి.
MAA Election : మోహన్ బాబుకు ప్రకాశ్‌రాజ్ పాదాభివందనం…! విష్ణుతో చేతులు కలిపి..
ఇది జరిగిన పావుగంటకు… ప్రకాశ్ రాజ్, విష్ణు కలిసి బయటకు వచ్చారు. ముఖంలో నవ్వు చూపిస్తూ అంతా బానే జరుగుతోందని కవర్ చేశారు. ఐతే.. లోపల మాత్రం మంటలు అలాగే కొనసాగుతోందనే విషయం అర్థమయ్యేలా కొన్ని కామెంట్స్ చేశారు. లోపల నరేశ్ తో కౌగిలి గురించి ప్రకాశ్ రాజ్ ను ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. “ఆ కౌగిలించుకుంటాం. ఆయన ఆలింగనానికి అర్థాలు చాలా ఉంటాయి” అంటూ ప్రకాశ్ రాజ్ అక్కడినుంచి విష్ణుతో కలిసి వెళ్లిపోయారు.