MVV Satyanarayana : వైసీపీ ఎంపీ సినిమాని ఆపాలని ఎలక్షన్ కమిషన్‌కి లేఖ.. కౌంటర్ ఇచ్చిన కోన వెంకట్..

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఈ సినిమా రిలీజ్ ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు.

MVV Satyanarayana : వైసీపీ ఎంపీ సినిమాని ఆపాలని ఎలక్షన్ కమిషన్‌కి లేఖ.. కౌంటర్ ఇచ్చిన కోన వెంకట్..

Producer Natti Kumar Wrote a Letter to Election Commission on MVV Satyanarayana Geethanjali Malli Vachindhi Movie

Updated On : March 25, 2024 / 12:50 PM IST

MVV Satyanarayana : అంజలి(Anjali) ముఖ్య పాత్రలో 2014 లో వచ్చిన హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’ మంచి విజయం సాధించింది. మళ్ళీ పదేళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమా అంజలికి 50వ సినిమా అవడం విశేషం. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకులని భయపెట్టి నవ్వించారు. దీంతో గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi)సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఏప్రిల్ 11న గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని శివ తుర్లపాటి డైరెక్ట్ చేయగా వైసీపీ ఎంపీ, నిర్మాత MVV సత్యనారాయణ బ్యానర్ MVV సినిమా, కోన వెంకట్ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఈ సినిమా రిలీజ్ ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ ఉన్నందున వైసీపీ ఎంపీ సత్యనారాయణ నిర్మిస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా రిలీజ్ ఆపాలి అంటూ ఎలక్షన్ కమిషన్ కి నట్టి కుమార్ లేఖ రాశారు. దీనిపై ఈ సినిమాకి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న కోన వెంకట్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు.

Also Read : Taapsee Pannu : తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? ఒలంపిక్ విజేతతో తాప్సీ పెళ్లి..?

ఈ వీడియోలో కోన వెంకట్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 11న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఒక నిర్మాత ఈ సినిమా ఆపాలని ఎలక్షన్ కమీషన్ కు లేఖ రాశారు. ఆ నిర్మాత ఎలక్షన్ కమిషన్, సెన్సార్ బోర్డు రూల్స్ తెలుసుకుని రాస్తే బాగుండేది. రిలీజ్ ఆపాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగదు. మా సినిమా ఒక ప్రాంతానికో, కులనీకో, మతానికో, వర్గానికో చెందింది కాదు అని కౌంటర్ ఇచ్చారు. దీంతో కోన వెంకట్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా టాలీవుడ్ లో ఈ సినిమా ఇష్యూ చర్చగా మారింది.