Bandla Ganesh – SKN : బండ్లన్న వర్సెస్ SKN.. బండ్ల గణేష్ మాటలకు కౌంటర్ ఇచ్చిన నిర్మాత..
బండ్ల గణేష్, నిర్మాత SKN ఇద్దరూ ఇద్దరే. స్టేజ్ ఎక్కితే తమ స్పీచ్ లతో వైరల్ అవుతారు. (Bandla Ganesh - SKN)
Bandla Ganesh - SKN
Bandla Ganesh – SKN : బండ్ల గణేష్, నిర్మాత SKN ఇద్దరూ ఇద్దరే. స్టేజ్ ఎక్కితే తమ స్పీచ్ లతో వైరల్ అవుతారు. ఇటీవల బండ్ల గణేష్ లిటిల్ హార్ట్స్ సినిమా సినిమా సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ.. కింద అందరూ పనిచేస్తే చివర్లో వచ్చి అల్లు అరవింద్ గారు సక్సెస్ క్రెడిట్ తీసుకుంటారు అని అన్నాడు. అప్పుడే ఆ మాటలకు బన్నీ వాసు సమాధానమిచ్చాడు. తాజాగా ఆ మాటలకు నిర్మాత SKN కౌంటర్ ఇచ్చాడు.
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ బుధవారం రాత్రి జరిగింది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ నిర్మించింది. ఈ ఈవెంట్ కి గీత్ ఆర్ట్స్ తో అనుబంధం ఉన్న నిర్మాతలు, అల్లు అరవింద్ కూడా వచ్చారు.
Also Read : Producer SKN : రష్మిక సినిమా చూసి చున్నీ తీసేసిన అమ్మాయి.. కౌంటర్ ఇచ్చిన SKN..
ఈ క్రమంలో నిర్మాత SKN స్టేజిపై మాట్లాడుతూ.. అప్డేట్స్ అవసరం లేని సాఫ్ట్ వేర్స్ ఏదైనా ఉంటే అది అల్లు అరవింద్ గారు. నాకు తెలిసి ఇండియాలో ఏ నిర్మాత కూడా ఇన్నాళ్ల నుంచి యాక్టివ్ గా ఉండి, యాక్టివ్ గా ఉండి హిట్స్ కొడుతూ సక్సెస్ లు చూస్తున్నవాళ్ళు లేరు. తను హిట్స్ కొట్టడమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా నిర్మాతలను చేసి వాళ్ళు హిట్స్ కొడుతుంటే చివర్లో వచ్చి క్రెడిట్ తీసుకోరు. వాళ్ళ క్రెడిట్ ని ఎంజాయ్ చేస్తూ మీసం మెలేసే ప్రొడ్యూసర్ ఎవరైనా ఉన్నారంటే అది అల్లు అరవింద్ ఒక్కరే.
ఆయన తీసుకునే క్రెడిట్ ఏంటంటే నా వాళ్ళు అంతా బాగున్నారు. నేను సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా బాగున్నారు. వాళ్ళు అంతా బాగుంటే అది నా సక్సెస్ అని చెప్పి ఆ క్రెడిట్ మాత్రమే ఎంజాయ్ చేసే నిర్మాత అల్లు అరవింద్ గారు. ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ నుంచి అయినా ఒక నిర్మాత ఫ్యామిలిలో వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు వచ్చారు కానీ ఆయన బ్యానర్ లో మాత్రం నిర్మాత అవ్వాలంటే ఆయనతో పరిచయం ఉండి మీ దగ్గర కంటెంట్ ఉంటే చాలు ఆయన మీకు బ్యానర్ ఇచ్చేస్తారు. అలాంటి ఏకైక నిర్మాత ఇండియాలో అల్లు అరవింద్ గారు అని అన్నారు. దీంతో SKN వ్యాఖ్యలు బండ్లన్నకు కౌంటర్ అంటూ వైరల్ చేస్తున్నారు.
Also See : Akhanda 2 Song : ‘అఖండ 2’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. అఖండ తాండవం..
