Producer SKN : యూరప్ లో ప్రభాస్ కి పెద్ద విల్లా ఉంది.. ఆ మాట చెప్పాడని తెలిసి కన్నీళ్లు వచ్చాయి.. SKN వైరల్ స్పీచ్..

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో నిర్మాత SKN స్పీచ్ వైరల్ గా మారింది. (Producer SKN)

Producer SKN : యూరప్ లో ప్రభాస్ కి పెద్ద విల్లా ఉంది.. ఆ మాట చెప్పాడని తెలిసి కన్నీళ్లు వచ్చాయి.. SKN వైరల్ స్పీచ్..

Producer SKN

Updated On : December 27, 2025 / 9:44 PM IST

Producer SKN : మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్ గా ఈ సినిమా రానుంది. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(Producer SKN)

నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో నిర్మాత SKN స్పీచ్ వైరల్ గా మారింది.

Also Read : Prabhas : పిలకతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ‘స్పిరిట్’ లుక్ లో ‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

నిర్మాత SKN మాట్లాడుతూ.. ప్రభాస్ కి ఒక స్టోరీ లైన్ చెప్పాడు మారుతీ. ఆ తర్వాత మారుతీ చేసిన ఒక సినిమా ఆడలేదు. వాళ్ళ నాన్న గారు కూడా అదే సమయంలో మరణించారు. దాంతో మారుతీ చాలా డౌన్ లో ఉన్నాడు. ఇంకో సినిమా చేసి వస్తాను అని ప్రభాస్ కి చెప్దామని మారుతీ వెళ్ళాడు. ప్రభాస్ ఇంట్లోకి మారుతీ వెళ్తే నేను మూడు నాలుగు గంటలు బయట కార్ లో ఎదురు చూసాను. బయటకు వచ్చి డార్లింగ్ నేను కెరీర్ లో 11 సినిమాలు చేశాను. కానీ నెక్స్ట్ రెండు మూడేళ్లు నా ఊపిరి, నా కెరీర్, నా ఫోకస్ మొత్తం ప్రభాస్ గారే అని చెప్పాడు.

ఏమైంది అంటే ఆ సినిమా ఆడకపోతే మీ తప్పు కాదు, మీ స్క్రిప్ట్ నాకు నచ్చింది చేద్దాం అని ప్రభాస్ చెప్పినట్టు తెలిపాడు మారుతీ. అది చెప్పాక నాకు కన్నీళ్లు వచ్చాయి. ఒకప్పుడు నేను, మారుతీ కలిసి 20 రూపాయలు పోగేసుకొని ఫుల్ మీల్స్ తినేవాళ్ళం. అలాంటి రోజుల నుంచి ఇక్కడికి వచ్చాము. యూరప్ లో షూటింగ్ జరిగినప్పుడు ప్రభాస్ గారు పెద్ద విల్లా తీసుకున్నారు. అందులో పెద్ద కిచెన్ ఉంటుంది. అక్కడి ఫుడ్ మేము తినలేకపోతే ప్రభాస్ గారి చెఫ్ మాకు షూటింగ్ ఉన్నన్ని రోజులు వండి పెట్టాడు. మూడు నిమిషాల 20 సెకండ్స్ రాజాసాబ్ కొత్త ట్రైలర్ చూసి వచ్చా. అదిరిపోయింది. అది చూస్తే ట్రోల్స్ ఉండవు అని అన్నారు. SKN స్పీచ్ తో రాజాసాబ్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Rajasaab : అసలు ఇదేం ప్లాన్ ‘రాజాసాబ్’.. ఇప్పుడు సడెన్ గా ఇన్ని రోజుల ముందే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటి..?