TG Vishwa Prasad : పవన్ ప్రోత్సాహంతో ఏపీలో 13 వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్న టాలీవుడ్ నిర్మాత.. ఓర్వకల్లు దగ్గర ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్..

పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఓర్వకల్లు దగ్గర 12వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎం.ఓ.యూ. చేసుకొంది.

TG Vishwa Prasad : పవన్ ప్రోత్సాహంతో ఏపీలో 13 వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్న టాలీవుడ్ నిర్మాత.. ఓర్వకల్లు దగ్గర ఎలక్ట్రిక్ వెహికిల్ పార్క్..

Producer TG Vishwa Prasad initiative innovative Electric Vehicle mobility park at Orvakal signed an MoU with the Government of Andhra Pradesh

Updated On : January 18, 2025 / 3:34 PM IST

TG Vishwa Prasad : టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ సినిమాల్లో నిర్మాతగానే కాక సాఫ్ట్ వేర్ కంపెనీలు, పలు టెక్ కంపెనీలు అమెరికాలో, ఇండియాలో ఉన్నాయి. పీపుల్ టెక్ గ్రూప్ అధినేతగా టీజీ విశ్వప్రసాద్ కు పవన్ తో ముందు నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈయన నిర్మాణంలో పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కూడా చేసారు.

Also Read : Chiranjeevi-Thaman : చిరంజీవి ట్వీట్‌కు త‌మ‌న్ రిప్లై.. ఒక్కోసారి ఆవేదన..

ఇప్పటికే పీపుల్ టెక్ గ్రూప్ తరపున ఆదోనిలో ఓ కంపెనీ పెట్టారు టీజీ విశ్వప్రసాద్. ఇప్పుడు కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లులో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని నిర్మాత, పీపుల్ టెక్ గ్రూప్ అధినేత టీజీ విశ్వప్రసాద్,, కంపెనీ ప్రతినిధులు కలిశారు.

పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఓర్వకల్లు దగ్గర 12వందల ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్ పార్కు నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎం.ఓ.యూ. చేసుకొంది. దీనికి సంబంధించి పీపుల్ టెక్ గ్రూప్ CEO టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. వాహన తయారీ, ఆర్ అండ్ డి కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాంతాలాంటివి ఇందులో ఉంటాయి. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఈవి పార్కు. దీని ద్వారా 13 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురాబోతున్నాం. 25 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

Also Read : Sankranthiki Vasthunnam : మహేష్ బాబుతో సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ పార్టీ.. ఫొటోలు చూశారా?