PS-2 Movie: డిజిటల్ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న పొన్నియిన్ సెల్వన్-2

ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-2 మూవీ డిజిటల్ పార్ట్‌నర్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది.

PS-2 Movie: డిజిటల్ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న పొన్నియిన్ సెల్వన్-2

PS-2 Movie Locks Digital Partner

Updated On : April 28, 2023 / 9:46 PM IST

PS-2 Movie: తమిళంలో ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-1 గతంలో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ హిస్టారికల్ మూవీకి ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా పొన్నియిన్ సెల్వన్-2 మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.

Ponniyin Selvan 2: తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న PS-2

ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ వస్తుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. తొలి భాగానికి పర్ఫెక్ట్ సీక్వెల్‌గా ఈ సినిమా రావడంతో ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. కాగా, ఈ సినిమాలో భారీ తారాగణం ఉండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్స్ నటించడంతో వారి అభిమానులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్‌గా ఉన్నారు.

PS-2: యూఎస్‌లో రిలీజ్‌కు ముందే దుమ్ములేపుతోన్న PS2..!

కాగా, ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవగా, ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ పార్ట్‌నర్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్.రెహమాన్ సంగీతం అందించాడు.