PS1: పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి బుల్లితెర ప్రేక్షకుల ఝలక్..!

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు మణిరత్నం. ఇక భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కించగా, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు.

PS1: పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి బుల్లితెర ప్రేక్షకుల ఝలక్..!

PS1 Movie Gets Shocking TRP Rating

Updated On : March 2, 2023 / 9:18 PM IST

PS1: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు మణిరత్నం. ఇక భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కించగా, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేశారు.

Ponniyin Selvan 1: బుల్లితెరపై సందడి చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న పొన్నియిన్ సెల్వన్ 1

కాగా, ఈ సినిమాకు వెండితెరపై ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లతో అదిరిపోయే సక్సెస్ అందుకుంది. ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, ఈ చిత్ర రెండో భాగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు కూడా మంచి రెస్పాన్స్ అందించారు. అయితే తాజాగా ఈ సినిమాను బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేశారు. దీంతో ఈ సినిమా ఎలాంటి టీఆర్పీ రేటింగ్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

Ponniyin Selvan II : PS-2 రిలీజ్ డేట్‌లో మార్పు లేదు.. కన్‌ఫార్మ్ చేసిన నిర్మాతలు..

కానీ, ఈ సినిమాకు ఊహించని విధంగా టీఆర్పీ రేటింగ్ రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ 1 చిత్రానికి తెలుగు బుల్లితెరపై కేవలం 2.73 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. భారీ స్థాయిలో తెరకెక్కి, బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ఇలాంటి టీఆర్పీ రేటింగ్ రావడంతో చిత్ర వర్గాలు కూడా అవాక్కవుతున్నాయి. ఇక పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్‌ను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.