Vishnu Vardhan Reddy : హీరోగా మారిన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్.. ఓ తండ్రి తీర్పు అంటూ ప్రేక్షకుల ముందుకి..
100 సినిమాలకు పైగా పబ్లిసిటీ డిజైనర్ గా సుపరిచితమైన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి(విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Publicity designer Vishnu Vardhan Reddy turned as hero with O Thandri Teerpu Movie
Vishnu Vardhan Reddy : 500 సినిమాలకు పైగా లోగోస్, 100 సినిమాలకు పైగా పబ్లిసిటీ డిజైనర్ గా సుపరిచితమైన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి(విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా, రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’ అనే సినిమా తెరకెక్కుతుంది.
Just A Minute : ఏడు చేపల కథ హీరో ఈ సారి ‘జస్ట్ ఏ మినిట్’ అంటూ.. టీజర్ విడుదల..
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇటీవలే ఎడిటింగ్ పూర్తయింది. తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంత మానసికక్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.