బిగ్ బాస్ 3: నా కోసం రక్తం ఇస్తావా? అని అడిగిన రాహుల్.. పునర్నవి హర్ట్ అయ్యింది

  • Published By: vamsi ,Published On : August 27, 2019 / 05:02 AM IST
బిగ్ బాస్ 3:  నా కోసం రక్తం ఇస్తావా? అని అడిగిన రాహుల్.. పునర్నవి హర్ట్ అయ్యింది

Updated On : August 27, 2019 / 5:02 AM IST

బిగ్ బాస్ సీజ‌న్ 3 నిన్నటివరకు అలకలు, కోపాలు, నవ్వులు, ఏడుపులుగా సాగిన షో.. మెల్లిమెల్లిగా అసలు గేమ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఇప్ప‌టివరకు 5వారాలు పూర్తి అవగా ఇంటి నుంచి హేమ‌, జాఫ‌ర్, త‌మ‌న్నా, రోహిణి, అషూ రెడ్డి బ‌య‌ట‌కి వచ్చేశారు. ఈక్రమంలో లేటెస్ట్ గా జరిగిన ఎపిసోడ్ లో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది.

అదేమిటంటే.. బిగ్ బాస్ హౌస్ లో రాహుల్, పునర్నవి జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జంట షోలో కాస్త ఎట్రాక్షన్ గా అనిపిస్తుంది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ షోకి పెద్ద ప్లస్ అని కూడా నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి అనుబంధంపై షోలో కూడా చర్చలు సాగాయి.

అయితే లేటెస్ట్ గా వీరిద్దరి మధ్య గార్డెన్ ఏరియాలో చిన్న టాపిక్ పై మాటలు నడిచాయి. మాటల మధ్యలో ఇద్దరి మధ్య తేడా రావడంతో రాహుల్ సిప్లిగంజ్.. పున‌ర్న‌వి నువ్వు ఒక ఫ్రెండ్ వి మాత్ర‌మే. నీలాంటోళ్లు నాకు బయట చాలామంది ఉన్నారు. నా కోసం రక్తం కూడా ఇస్తారు. నువ్వు నా కోసం రక్తం ఇస్తావా? ఇవ్వవు కదా? అని అన్నాడు.

దీంతో పున‌ర్న‌వి హర్ట్ అయ్యింది. వరుణ్ సందేశ్ పున‌ర్న‌వి, రాహుల్‌ని క‌లిపే ప్ర‌య‌త్నం చేసినా కుదరలేదు. ఇక ఈ వారం మహేష్‌, పునర్నవి, రవి, హిమజ, రాహుల్, వరుణ్ సందేశ్ నామినేషన్లలో ఉన్నారు.