Puneeth rajkumar : పునీత్ అంతక్రియలకు తరలి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

పునీత్ అంతక్రియలకి కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. సినీ ప్రముఖులు రవిచంద్రన్, సుదీప్,

Puneeth rajkumar : పునీత్ అంతక్రియలకు తరలి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

Puneeth (1)

Updated On : October 31, 2021 / 8:08 AM IST

Puneeth rajkumar :  కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం అందర్నీ కలిచివేసింది. నిన్న ఆయనకు నివాళులు అర్పించడానికి లక్షల్లో అభిమానులు వేలల్లో సెలబ్రిటీలు వచ్చారు. ఇవాళ ఉదయం 4.30 గంటలకే అంతిమ యాత్ర మొదలైంది. భౌతికకాయాన్ని స్టేడియం దగ్గర్లోనే ఉన్న కంఠీరవ స్టూడియోకి తరలించారు. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల కన్నీటి మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిగాయి. సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Puneeth Rajkumar : ఉదయం 4.30 గంటలకే ప్రారంభమైన పునీత్ అంతిమ యాత్ర

పునీత్ అంతక్రియలకి కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. సినీ ప్రముఖులు రవిచంద్రన్, సుదీప్, యష్, రిషబ్ శెట్టి, టెన్నిస్ కృష్ణ, శ్రీజన్ లోకేష్, ఎంపీ సుమలత, యోగితో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఈ అంతక్రియల్లో పాల్గొన్నారు. అభిమానులు, సన్నిహితులు, ప్రముఖుల నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ అంతక్రియలు పూర్తి అయ్యాయి.