Pushpa 2: రెడీ కాండబ్బా.. అంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమైన పుష్పరాజ్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులతో పాటు యావత్ సినీ వర్గాలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయో ప్రత్యేకంగ చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక పుష్ప తొలి భాగం మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో, రెండో భాగం కూడా అదే తరహా సక్సెస్‌ను అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Pushpa 2: రెడీ కాండబ్బా.. అంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమైన పుష్పరాజ్..?

Pushpa 2 Fan-made Update Goes Viral

Updated On : February 28, 2023 / 5:18 PM IST

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులతో పాటు యావత్ సినీ వర్గాలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయో ప్రత్యేకంగ చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక పుష్ప తొలి భాగం మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో, రెండో భాగం కూడా అదే తరహా సక్సెస్‌ను అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Pushpa 2: పుష్ప-2 షూటింగ్ అప్డేట్.. వైజాగ్‌లో ఏం జరుగుతుందంటే..?

ఇక ఈ సినిమాకు సంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ఏప్రిల్ 8న ఇవ్వబోతున్నట్లు ఈ పోస్ట్‌లో ఉంది. దీంతో అభిమానులు పుష్ప-2 చిత్రాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే, పుష్ప-2 సినిమాకు సంబంధించిన ఈ అప్డేట్ కేవలం ఫ్యాన్ మేడ్ అని తెలుస్తోంది. ఓ పోస్టర్ ద్వారా ఈ సినిమా అప్డేట్‌ను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, దాన్ని అభిమానులు వైరల్ చేస్తున్నారు.

Pushpa 2: పుష్పరాజ్‌కు లీకుల బెడద.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

అయితే, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుండగా, ఈ సినిమాలో బన్నీ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.