Love Me : ‘రావాలి రా’ అంటూ దెయ్యం ప్రేమగీతం.. వైష్ణవి చైతన్య పాడిన మొదటి పాట..

ఆశిష్, వైష్ణవి చైతన్య నటిస్తున్న హార్రర్ మూవీ 'లవ్ మీ' నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది. రావాలి రా అంటూ..

Love Me : ‘రావాలి రా’ అంటూ దెయ్యం ప్రేమగీతం.. వైష్ణవి చైతన్య పాడిన మొదటి పాట..

Raavaali Raa Song released from Ashish Vaishnavi Chaitanya Love Me movie

Updated On : March 30, 2024 / 4:25 PM IST

Love Me : దిల్ రాజు నిర్మాణంలో ఆశిష్, వైష్ణవి చైతన్య నటిస్తున్న రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘లవ్ మీ’. ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ తో మూవీ మంచి బజ్ నే క్రియేట్ చేసారు. దెయ్యాన్ని ప్రేమించడం కోసం.. హీరో దెయ్యాన్ని వెతుకుంటూ వెళ్లడం అందర్నీ ఆకట్టుకుంది. దీంతో మూవీ పై ఆడియన్స్ కి మంచి ఆసక్తి కలిగింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్న మేకర్స్.. తాజాగా మొదటి సాంగ్ ని రిలీజ్ చేసారు.

‘రావాలి రా’ అంటూ దెయ్యం పాడే ప్రేమగీతాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఆస్కార్ ద్వయం ఎం ఎం కీరవాణి, చంద్రబోస్ ఈ పాటని రూపొందించగా.. అమల చేబోలు, గోమతి ఐయర్, అదితి భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్వీన్, సాయి శ్రేయ పాటని పాడారు. వీరితో పాటు వైష్ణవి కూడా ఈ పాట పాడిందట. ఈ పాట పాడడం కోసం దాదాపు వారం పాటు ప్రాక్టీస్ చేసిందట. మరి వైష్ణవి పాడిన ఆ ఫస్ట్ సాంగ్ ని మీరు కూడా వినేయండి.

Also read : Tillu Square : భారీ ధరకు అమ్ముడుపోయిన టిల్లు గాడి ఓటీటీ రైట్స్..

కాగా ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో ఈ పాటలోని ఓ లైన్ ని వైష్ణవి పాడారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫుల్ సాంగ్ ని పాడతారని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని అరుణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజైన అన్ని కంటెంట్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుందనేది మాత్రం దిల్ రాజు క్లారిటీ ఇవ్వలేదు.