Radhe Shyam : రెబల్ స్టార్ రేంజ్.. నార్త్‌లో బిగ్గెస్ట్ రిలీజ్..
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీని హిందీలో నెవర్ బిఫోర్ అనే రేంజ్లో రిలీజ్ చెయ్యబోతున్నారు.. ఎన్ని థియేటర్లో తెలుసా?..
Radhe Shyam: రెబల్ స్టార్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమానుల మూడేళ్ల ఎదురూచూపులకు మరికొద్ది రోజుల్లో తెర పడనుంది. డార్లింగ్, పూజా హెగ్డే జంటగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రానున్న ‘రాధే శ్యామ్’ 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Radhe Shyam : చార్టర్డ్ ఫ్లైట్‌లో ప్రభాస్.. ప్లాన్ అదిరిందిగా!
రెబల్ స్టార్ డా.కృష్ణంరాజు కీలకపాత్రలో కనిపించనున్నారు. టీ సిరిస్ సంస్థతో కలిసి.. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల మీద వంశీ, ప్రమోద్, ప్రసీద (ప్రభాస్ సిస్టర్) ఈ పాన్ ఇండియా సినిమాను భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘ఈ రాతలే’ లిరికల్ సాంగ్‌కి అదిరపోయే రెస్పాన్స్ వస్తోంది.
Radhe Shyam : 30 నిమిషాల పాటు భారీ షిప్లో
ఇక నార్త్‌లోనూ బిగ్గెస్ట్ రిలీజ్ ప్లాన్ చేశారు. ‘బాహుబలి’ తో బాలీవుడ్ వాళ్లు సైతం ఆశ్చర్యపోయేలా చేసాడు ప్రభాస్. తర్వాత ‘సాహో’ కి ఏ రేంజ్ హైప్ వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు ‘రాధే శ్యామ్’ మూవీని నెవర్ బిఫోర్ అనే స్థాయిలో రిలీజ్ చెయ్యబోతున్నారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్ నార్త్‌లో అక్షరాలా 3,500 ల స్క్రీన్స్ బుక్ చేసేశారట. దీన్ని బట్టి డార్లింగ్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Adipurush : పక్కా పాన్లింగ్.. అనుకున్న టైంకే ‘ఆదిపురుష్’