హాస్పిటల్లో హీరోయిన్.. సమాధానం చెప్పేవరకు వదలని నెటిజన్లు..
కరోనా ఎఫెక్ట్ : రాధికా ఆప్టేకు కరోనా సోకిందంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

కరోనా ఎఫెక్ట్ : రాధికా ఆప్టేకు కరోనా సోకిందంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తుంటే అంతకంటే వేగంగా సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. సినిమా షూటింగులకు బ్రేక్ పడడంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసిన రాధికా ఆప్టేకు కరోనా వైరస్ సోకిందనే వార్త ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది.
దీనికి కారణం.. ముఖానికి మాస్క్ ధరించి హాస్పిటల్లో కూర్చున్న ఫోటోను రాధిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడమే.. ఇక చూస్కోండి.. రాధిక కూడా కరోనా వైరస్ బారిన పడిందని, ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోందని రకరకాల వార్తలు వచ్చాయి. రాధిక ఫోటో చూసి ‘గల్లీబాయ్’ ఫేమ్ విజయ్ వర్మ.. ‘ఓ గాడ్.. జాగ్రత్త డార్లింగ్.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు’ అంటూ కామెంట్ చేయడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. అసలే పనిలేక ఖాళీగా ఉన్నవాళ్లందరూ తెగ కామెంట్లు చేస్తుండడంతో రాధిక క్లారిటీ ఇచ్చింది.
తాను కరోనా వైరస్ బారిన పడలేదని కన్ఫామ్ చేస్తూ..‘నేను హాస్పిటల్‌కు వెళ్లాను. అయితే కోవిడ్-19 పరీక్షల కోసం మాత్రం కాదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండ’ని రాధిక పోస్ట్ చేసింది. అయితే తాను హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లిందో మాత్రం రాధిక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రాధిక అబద్ధం చెబుతుంది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అసలు తాను హాస్పిటల్‌కి ఎందుకు వెళ్లింది అనేది ఆమె నోటే చెప్పించేటట్లున్నారు నెటిజన్స్..