Chandramukhi 2 : ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చంద్రముఖి.. ఎప్పుడు, ఎక్కడ తెలుసా..?
రజినీకాంత్ నటించిన చంద్రముఖికి సీక్వెల్ గా తెరకెక్కిన రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

Raghava Lawrence Kangana Ranaut Chandramukhi 2 OTT release date
Chandramukhi 2 : రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటిస్తూ తెరకెక్కిన చిత్రం ‘చంద్రముఖి 2’. పి.వాసు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రజినీకాంత్ నటించిన చంద్రముఖికి సీక్వెల్ గా తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. కంగనా రనౌత్ ఈ సినిమాలో చంద్రముఖి పాత్రని పోషించింది. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది.
రజినికాంత్ నటించిన ‘చంద్రముఖి’ హార్రర్ కామెడీ చిత్రాల్లో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు నెలకుంటాయి. చంద్రముఖి 1 చిత్రాన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టరే సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు అంటే మరింత క్యూరియాసిటీ ఉండడం సహజం. అయితే ఈ అంచనాలను అందుకునేలా సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు వాసు విఫలం అయ్యాడు. ఇక థియేటర్ లో పెద్దగా బయపెట్టని చంద్రముఖి.. ఓటీటీకి వస్తే చూడాలని చాలామంది వేచిచూస్తున్నారు.
Also read : NTR : గోవాకి ఎన్టీఆర్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రసారం కానుంది. అక్టోబర్ 26 నుంచి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. మరి థియేటర్స్ లో బయపెట్టని చంద్రముఖి.. ఓటీటీలో బయపెట్టగలదా అనేది చూడాలి.
View this post on Instagram