Rajinikanth : కల్కిపై రజినీకాంత్ రివ్యూ.. పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నాను అంటూ..

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కల్కి సినిమా చూసి తన సోషల్ మీడియాలో సినిమా గురించి పోస్ట్ చేసారు.

Rajinikanth : కల్కిపై రజినీకాంత్ రివ్యూ.. పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నాను అంటూ..

Rajinikanth Special Tweet on Kalki 2898AD Movie and Appreciated Kalki Movie Team

Updated On : June 29, 2024 / 11:43 AM IST

Rajinikanth : ప్రభాస్ కల్కి 2898AD సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా చూసిన ప్రేక్షకులు కల్కి విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం ఎపిసోడ్స్ గురించి గొప్పగా చెప్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా అదరగొడుతుంది. కల్కి మొదటి రోజే 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు కూడా నాగ్ అశ్విన్ ని, మిగతా మూవీ టీమ్ ని అభినందిస్తూ పోస్టులు చేస్తున్నారు.

Also Read : Kamal Haasan : పార్ట్ 2లో ఎక్కువ సేపు కనిపిస్తాను.. పార్ట్ 3 కూడా.. కల్కి సినిమాపై కమల్ హాసన్ వ్యాఖ్యలు..

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కల్కి సినిమా చూసి తన సోషల్ మీడియాలో సినిమా గురించి పోస్ట్ చేసారు. రజినీకాంత్ తన పోస్ట్ లో.. కల్కి సినిమా చూశాను. వావ్.. అద్భుతమైన సినిమా. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాని వేరే లెవల్ కి తీసుకెళ్లారు. నా ఫ్రెండ్ అశ్వినీదత్, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకోన్.. మిగిలిన కల్కి టీమ్ అందరికి నా అభినందనలు. పార్ట్ 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.

 

రజినీకాంత్ ట్వీట్ కి దర్శకుడు నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ.. మాటల్లేవు సర్, మా టీమ్ అందరి తరపున ధన్యవాదాలు అని తెలిపాడు. రజినీకాంత్ కూడా కల్కి సినిమా గురించి గొప్పగా చెప్పడంతో అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.