Cinematograph Bill 2023 : సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్ళు జైలుతో పాటు భారీ జరిమానా.. బిల్ పాస్ చేసిన రాజ్యసభ..

తాజాగా రాజ్యసభలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 ప్రవేశపెట్టారు. ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది.

Cinematograph Bill 2023 : సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్ళు జైలుతో పాటు భారీ జరిమానా.. బిల్ పాస్ చేసిన రాజ్యసభ..

RajyaSabha Approved Cinematography Amendment Bill 2023 Introduced by Anurag Thakur

Updated On : July 29, 2023 / 5:11 PM IST

Cinematograph Amendment Bill 2023 :  అన్ని సినీ పరిశ్రమలకి పైరసీ తలనొప్పిగా మారింది. గతంలో సినిమా పైరసీపై అనేక చట్టాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైరసీకి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించి పైరసీ చేసిన వాళ్లకి శిక్షలు కూడా వేశారు. అయినా పైరసీ మాత్రం తగ్గట్లేదు. ఇటీవల పైరసీ మరింత పెరిగింది. సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ వచ్చేస్తుంది. పలు వెబ్ సైట్స్ ని ఎన్ని సార్లు బ్లాక్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ కూడా పైరసీపై దృష్టి సారించింది.

ఈ వర్షాకాల సమావేశాల్లో లోక్ సభలో పాస్ అయిన సినిమాటోగ్రఫీ సవరణ బిల్ 2023 తాజాగా రాజ్యసభలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) ప్రవేశపెట్టారు. ఈ బిల్ ని రాజ్యసభ పాస్ చేసింది. ఈ బిల్ లో అనేక అంశాలు ఉన్నా ముఖ్యంగా పైరసీ, సెన్సార్ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా సవరించిన సినిమాటోగ్రఫీ బిల్ ప్రకారం ఇకపై సినిమాని పైరసీ చేసినా, సినిమాని థియేటర్స్ లో రికార్డ్ చేస్తే మూడేళ్ళ జైలు శిక్షతో పాటు, ఆ సినిమా ప్రొడక్షన్ ఖర్చులో 5 శాతం జరిమానా విధిస్తారు. ఈ రూల్ ని చాలా కఠినతరంగా అమలు చేస్తామని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు..

Ambati Rambabu : బ్రో సినిమాలో అంబటి క్యారెక్టర్.. సినిమాపై సెటైర్స్ వేసిన మంత్రి అంబటి..

అనురాగ్ ఠాకూర్ ఈ బిల్ ని ప్రవేశపెట్టి.. ఇండియన్ సినిమాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రీచ్ వచ్చింది. కానీ పైరసీ వల్ల సంవత్సరానికి దాదాపు 20 వేల కోట్లు నష్టపోతున్నాం. అందుకే పైరసీని అరికట్టడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే పైరసీతో పాటు సెన్సార్ సర్టిఫికెట్స్ కూడా మార్చారు. ఇప్పటివరకు క్లీన్ U, U/A, A సర్టిఫికెట్ సినిమాలకు ఇస్తుండగా తాజాగా U/A, S లో మరో మూడు సర్టిఫికెట్లు తీసుకొచ్చారు. UA 7+, UA 13+, UA 16+ సర్టిఫికెట్స్ ఇవ్వనున్నారు. ఇవి ఆ ఏజ్ లోపు ఉన్నవాళ్లు పేరెంట్స్ పర్యవేక్షణలో మాత్రమే చూడాలి.