Rakhi Sawant : హాస్పిటల్ బెడ్ పై బాలీవుడ్ భామ.. ఏమైంది..?

ముంబైలోని ఓ హాస్పిటల్ లో రాఖీ సావంత్ చికిత్స తీసుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చాయి.

Rakhi Sawant : హాస్పిటల్ బెడ్ పై బాలీవుడ్ భామ.. ఏమైంది..?

Rakhi Sawant hospitalized due to some heart-related ailment Photos goes Viral

Updated On : May 15, 2024 / 10:44 AM IST

Rakhi Sawant : డ్యాన్సర్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన రాఖీ సావంత్ ఐటెం సాంగ్స్ తో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో రాణించింది. పలు టీవీ షోలలో కూడా పాల్గొని బాగా పాపులర్ అయింది. సినిమాలు, షోలతోనే కాక వివాదాలతో కూడా రాఖీ సావంత్ బాలీవుడ్ లో పాపులర్. అయితే తాజాగా రాఖీ సావంత్ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ముంబైలోని ఓ హాస్పిటల్ లో రాఖీ సావంత్ చికిత్స తీసుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చాయి. గుండెకు సంబంధిత వ్యాధితో రాఖీ సావంత్ చికిత్స తీసుకుంటుందని బాలీవుడ్ మీడియా అంటుంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. దీంతో రాఖీ సావంత్ ని అలా హాస్పిటల్ బెడ్ పై చికిత్స తీసుకుంటూ చూడటంతో అభిమానుల, పలువురు నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Also Read : Movie Theaters : తెలంగాణలో సినిమా థియేటర్స్ బంద్.. ఏకంగా పది రోజులు.. ఎందుకంటే..?

ఇక రాఖీ సావంత్ 2022 లో అదిల్ ఖాన్ దురాని అనే ఓ వ్యాపారవేత్తని రెండో పెళ్లి చేసుకుంది. కానీ ప్రస్తుతం వీరిద్దరూ కూడా విడివిడిగా ఉంటున్నారని సమాచారం. అసలు రాఖీ సావంత్ కి ఏమైంది, ఎందుకు హాస్పిటల్ లో ఉంది తెలియాలంటే ఆమె లేదా, ఆమె కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)