Rakul Preet Singh : సోషల్ మీడియాలో మరీ ఎక్కువ చేస్తున్నారు.. బాలీవుడ్ కి సపోర్ట్ చేస్తూ రకుల్ కామెంట్స్..
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే మరీ ఎక్కువ చేస్తున్నారు. హిందీ సినిమా, ప్రాంతీయ సినిమాలు రెండూ భారతీయ సినీ పరిశ్రమలే, అది గుర్తుంచుకోవాలి. ఒకదానితో ఒకటి పోల్చడం కరెక్ట్ కాదు........................

Rakul Preet Singh comments on south movie success and falling of bollywood
Rakul Preet Singh : తెలుగులో కెరటం సినిమాతో పరిచయమై ఆ తర్వాత వరుస హిట్స్ పడటంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో అక్కడికి చెక్కేసింది రకుల్. ఇక అప్పటి నుంచి సౌత్ సినిమాలవైపు చూడటమే మానేసింది. బాలీవుడ్ లో సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి రకుల్ కి. ప్రస్తుతం రకుల్ చేతిలో దాదాపు అరడజను బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ గత సినిమాలు దాదాపు 10 సినిమాలు పరాజయం పొందినా ఇంకా బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల సౌత్ సినిమాలు బాలీవుడ్ ని డామినేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు మంచి విజయాలు సాధించి కలెక్షన్స్ రప్పిస్తున్నాయి. ఈ విషయం గత కొన్నాళ్లుగా చర్చల్లో నిలుస్తూనే ఉంది. దీనిపై బాలీవుడ్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ అంశంపై మాట్లాడింది.
Zee Cine Awards 2023 : జీ సినీ అవార్డ్స్ 2023 బాలీవుడ్.. పూర్తి సమాచారం..
ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో అయితే మరీ ఎక్కువ చేస్తున్నారు. హిందీ సినిమా, ప్రాంతీయ సినిమాలు రెండూ భారతీయ సినీ పరిశ్రమలే, అది గుర్తుంచుకోవాలి. ఒకదానితో ఒకటి పోల్చడం కరెక్ట్ కాదు. మంచి సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తారు. అన్ని పరిశ్రమలలోను గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్లంతా మంచి సినిమాలు ఇవ్వడానికే కష్టపడుతున్నారు. సినిమా బాగుంటే థియేటర్ అయినా ఓటీటీ అయినా హిట్ అవుతుంది. సినిమా రిజల్ట్స్ అనేవి ప్రేక్షకుల ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంతే కానీ సినీ పరిశ్రమకి సంబంధించి కాదు అని తెలిపింది. దీంతో రకుల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ పరాజయాల్లో ఉంది అంటే ఒప్పుకోవట్లేదు, ఇప్పుడేమో ఇలా అందరూ ఒకటే అని మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడు బాలీవుడ్ సౌత్ సినిమాలని అస్సలు పట్టించుకోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.