Konidela Production: పాన్ ఇండియా స్టార్‌గా చరణ్.. ఇక కొణిదెల ప్రొడక్షన్ బాధ్యతలెవరికి?
మెగా.. అల్లు.. రెండు పేర్లుగా కనిపించినా రెండూ విడదీసి చూడలేని పరిస్థితి తెలుగు సినీ ఇండస్ట్రీలో. దాదాపు డజను మంది హీరోలు ఉన్న ఈ రెండు కుటుంబాలలో నిర్మాణ సంస్థలకు కొదువే లేదు.

Konidela Production
Konidela Production: మెగా.. అల్లు.. రెండు పేర్లుగా కనిపించినా రెండూ విడదీసి చూడలేని పరిస్థితి తెలుగు సినీ ఇండస్ట్రీలో. దాదాపు డజను మంది హీరోలు ఉన్న ఈ రెండు కుటుంబాలలో నిర్మాణ సంస్థలకు కొదువే లేదు. ఆన్ స్క్రీన్ నటనకు సంబంధించి.. సినిమాల ఎంపిక గురించి మెగాస్టార్ చిరంజీవి బాధ్యతగా భావిస్తే.. సినిమాల బిజినెస్, మార్కెట్ గురించి అల్లు అరవింద్ బాధ్యతగా మెలుగుతారు. ఇంకా చెప్పాలంటే.. మెగా-అల్లు రెండు కుటుంబాలకు సంబంధించి బిజినెస్ లో అల్లు అరవింద్ కీ రోల్ గా చెప్పుకుంటారు.
Sushmita Konidela: మెగా డాటర్ వెబ్ ఫిల్మ్ ప్రయత్నాలు.. తమిళ హిట్ సినిమా రీమేక్?
సినిమాల నిర్మాణానికి సంబంధించి గీతా ఆర్ట్స్ ఎప్పటి నుండో సినిమాలు నిర్మించి భారీ సక్సెస్ లు అందుకోగా.. మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇక అల్లు కాంపౌండ్ నుండే సాగే గీతా ఆర్ట్స్2 మరోవైపు సినిమాల నిర్మాణంలో కీలకంగా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్ భారీ సినిమాల నిర్మాణంతో సాగిపోతుంది. ఖైదీ No150 సినిమాతో నిర్మాణం మొదలుపెట్టిన రామ్ చరణ్.. సైరా నరసింహ రెడ్డి నిర్మించి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
Ram Charan : ఫిన్లాండ్‌లో రామ్ చరణ్, ఉపాసన.. మంచులో ఆడుకుంటూ..
ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ తో కలిసి ఆచార్యను నిర్మించిన రామ్ చరణ్ భవిష్యత్ లో సినిమాలను నిర్మిస్తాడా లేదా అని ఇండస్ట్రీ చర్చ జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. మరోవైపు శంకర్ తో సినిమాతో పాటు మరో రెండు, మూడు పాన్ ఇండియా సినిమాలు క్యూలో ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే.. రామ్ చరణ్ ఇకపై ముంబై నుండి చెన్నై వరకు దేశమంతా చుట్టేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కొణిదెల ప్రొడక్షన్ బాధ్యతలెవరికి అన్నది ఆసక్తి కరంగా మారింది.
Upasana Ramcharan:”ఉపాసనా రామ్ చరణ్” పై నెటిజన్లు ఆగ్రహం
ఆచార్య తర్వాత కొణిదెల ప్రొడక్షన్ బాధ్యతల్ని సుస్మిత కొణిదెల స్వీకరించనున్నట్లు తెలుస్తుంది. సుస్మిత ఇప్పటికే కాస్ట్యూమ్స్ తో పాటు తండ్రి సినిమాలకు నిర్మాతగా చరణ్ తో కలిసి బాధ్యతల్ని పంచుకున్నారు. అలాగే సొంత బ్యానర్ లో వెబ్ సిరీస్ ని నిర్మించిన అనుభవం కూడా ఉంది. అందుకే ఆమెనే ఇకపై తండ్రి సూచనలతో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ బాధ్యతల్ని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే నిన్నటి వరకు అడపాదడపా యాక్టివ్ గా ఉంటూ వచ్చిన సుష్మిత ముందుముందు సూపర్ యాక్టివ్ గా మారడం ఖాయంగా కనిపిస్తుంది.