RRR : అమెరికన్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఇండస్ట్రీ, ఆస్కార్ పై చరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ప్రస్తుతం RRR మూవీ ఆస్కార్ రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 13న ఆస్కార్ అవార్డుల పురస్కారం జరగనుంది. దీంతో రామ్ చరణ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇటీవల అమెరికా వెళ్ళాడు. ఇక అక్కడ వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓకే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ..

RRR : అమెరికన్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఇండస్ట్రీ, ఆస్కార్ పై చరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ram charan comments on bollywood industry

Updated On : February 24, 2023 / 2:03 PM IST

RRR : రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంతో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో ఫేమ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 13న ఆస్కార్ అవార్డుల పురస్కారం జరగనుంది. దీంతో రామ్ చరణ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇటీవల అమెరికా వెళ్ళాడు. ఇక అక్కడ వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అత్యధికమంది వీక్షించే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నాడు. తాజాగా మరో అమెరికన్ నెంబర్ వన్ న్యూస్ స్ట్రీమింగ్ ఛానల్ ABC న్యూస్ కి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Ram Charan : హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు గురించి రామ్‌చరణ్ కామెంట్స్.. అమెరికన్ యాంకర్ ప్రశంసలు!

ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘నేషనల్ లాంగ్వేజ్ హిందీ అవ్వడంతో ఎక్కువ మంది బాలీవుడ్ సినిమాలు చూస్తారు. దీంతో ఇండియాలో బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్ద మార్కెట్ అయ్యింది. అయితే మిగిలిన లాంగ్వేజ్స్ లో కూడా మంచి సినిమాలు ఉన్నాయి. వాటిలో నేషనల్ అవార్డ్స్ అందుకున్న చిత్రాలు ఉన్నాయి. కరోనా టైంలో మిగిలిన పరిశ్రమలు అన్ని ఎక్స్‌పాండ్ అయ్యాయి. ఇప్పుడు సదరన్ ఇండియన్ మూవీస్ ని ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఆదరిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిస్తే మీ రియాక్షన్ ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా, రామ్ చరణ్ బదులిస్తూ.. ‘ఆస్కార్ గెలవడం అనేది నా ఊహకు కూడా అందని విషయం. మా 80 ఏళ్ళ సినిమా చరిత్రలో ఆస్కార్ గెలుచుకోవడం ఒక కల. అది నెరవేరితే నేనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం గర్వ పడుతుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా నేడు HAC (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డ్స్ వేడుక జరగనుంది. ఈ అవార్డ్స్ లో కూడా RRR పలు కేటగిరీలో నామినేషన్స్ లో ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ ప్రజెంటర్ గా హాజరు కాబోతున్నాడు. అవార్డు విన్ అయిన వారు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరో కూడా చరణ్ కావడం గమనార్హం.