Ram Charan: వీకెండ్ ఎంజాయిమెంట్స్‌లో రాంచరణ్.. ”మిస్సింగ్ యూ” అంటూ ఎమోషనల్ అయిన ఉపాసన

మెగాస్టార్ వారసుడిగా వచ్చి టాలీవుడ్ కి పరిచయమైన రాంచరణ్, తన తండ్రిలా అలరిస్తాడా అని అనుకున్నారు అందరూ. కానీ చరణ్ అంతకుమించిపోయి ''RRR''లో అతని నటనకు కేవలం టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా మన్ననలు అందుకుంటూ యూనివర్సల్ స్టార్ అనిపించుకుంటున్నాడంటే అతిశయోక్తి కాదు. ఇక వరుస యాడ్స్, సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న చరణ్ కి ఈ వీకెండ్ కొంత సమయం దొరకడంతో...

Ram Charan: వీకెండ్ ఎంజాయిమెంట్స్‌లో రాంచరణ్.. ”మిస్సింగ్ యూ” అంటూ ఎమోషనల్ అయిన ఉపాసన

Ram Charan Enjoying his Weekends Without Upasana

Updated On : September 9, 2022 / 3:24 PM IST

Ram Charan: మెగాస్టార్ వారసుడిగా వచ్చి టాలీవుడ్ కి పరిచయమైన రాంచరణ్, తన తండ్రిలా అలరిస్తాడా అని అనుకున్నారు అందరూ. కానీ చరణ్ అంతకుమించిపోయి ”RRR”లో అతని నటనకు కేవలం టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా హాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా మన్ననలు అందుకుంటూ యూనివర్సల్ స్టార్ అనిపించుకుంటున్నాడంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటె ఒక హాలీవుడ్ మీడియా ఏకంగా ఒక ఆర్టికల్ ప్రచారించిందంటే రాంచరణ్ నటన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.

ప్రస్తుతం చరణ్ ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టరైన శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. శంకర్ సినిమాలు అంటేనే సోషల్ ఎలిమెంట్స్ ని మాస్ తో జతచేస్తూ అద్భుతంగా చూపించే ఒక విజువల్ వండర్, అయితే ఈ మధ్యకాలాన శంకర్ సినిమాలో అది మిస్ అయ్యింది. అయితే ఇప్పుడు ”RC15”తో మళ్ళీ ఆ శంకర్ ని చూడబోతున్నట్టు, ఈ సినిమాలో చరణ్ వ్యవస్థని ప్రశ్నించే పాత్రలో కనిపిస్తున్నట్టు.. ఆ సినిమాలో నటిస్తున్న కొంతమంది నటులు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇక విషయానికి వస్తే.. వరుస యాడ్స్, సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న చరణ్ కి ఈ వీకెండ్ కొంత సమయం దొరకడంతో ఆ సమయాన్ని అతడి కజిన్స్ తో కలిసి వీకెండ్ ట్రిప్ కి వెళ్ళాడు. అయితే ఈ ట్రిప్ కి ఉపాసన వెళ్లలేకపోవడంతో బాధపడుతూ, తన ట్విట్టర్ వేదికగా..”రామ్ & రైమ్ మిస్సింగ్ యూ” అంటూ ట్వీట్ చేస్తూ ఒక పిక్ పోస్ట్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.