Ram Charan Fans : ఇదెక్కడి సెంటిమెంట్ రా బాబు.. ఇలా కూడా సినిమా ఫ్లాప్ అవుతుందని భయపడతారా??

సాధారణంగా శంకర్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ ఇస్తాడు. కానీ చరణ్- శంకర్ సినిమాకు తమన్ ని సెలక్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బుచ్చిబాబు - చరణ్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని టాలీవుడ్ లో బజ్ నడుస్తుంది.

Ram Charan Fans : ఇదెక్కడి సెంటిమెంట్ రా బాబు.. ఇలా కూడా సినిమా ఫ్లాప్ అవుతుందని భయపడతారా??

Ram Charan Fans creates new sentiment for RC16 Movie

Updated On : April 11, 2023 / 12:49 PM IST

Ram Charan Fans :  RRR మూవీతో గ్లోబల్ గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. శంకర్ డైరెక్షన్ లోని ‘గేమ్ చేంజర్’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా నెక్స్ట్ మూవీని ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో చేయబోతున్నాడు. చెర్రీకి ఇది 16వ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ కి అత్యంత సన్నిహితుడైన వెంకట సతీష్ వృద్ధి సినిమాస్ పేరుతో కొత్త బ్యానర్ ఏర్పాటు చేసి ఈ సినిమాని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నాడు.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోని విలేజ్ యాక్షన్ స్టోరీగా చరణ్ – బుచ్చిబాబు సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా ఈ సినిమాలో కూడా జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. అలాగే తాజాగా సంగీతం కోసం ఏకంగా ఏఆర్ రెహమాన్ ని రంగంలోకి దించుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా శంకర్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ ఇస్తాడు. కానీ చరణ్- శంకర్ సినిమాకు తమన్ ని సెలక్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బుచ్చిబాబు – చరణ్ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని టాలీవుడ్ లో బజ్ నడుస్తుంది. అంత పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ ఇస్తున్నారంటే ఆనందపడాలి కానీ చరణ్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

Rashmika Mandanna : రష్మిక ఆ హీరోలకు నో చెప్పిందా??

చరణ్ అభిమానులు ఓ కొత్త సెంటిమెంట్ ని బయటకు తీసుకొచ్చారు. తెలుగులో AR రెహమాన్ డైరెక్ట్ గా సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్, నీ మనసు నాకు తెలుసు, నాని, కొమరం పులి, సాహసం శ్వాసగా సాగిపో.. సినిమాలకు సంగీతం అందించారు. అయితే ఈ సినిమాలు అన్ని మ్యూజికల్ గా హిట్ అయినా సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. AR రెహమాన్ డైరెక్ట్ తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన సినిమాల్లో ఏ మాయ చేసావే ఒక్కటే హిట్ అయింది. మిగిలిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో చరణ్ అభిమానులు AR రెహమాన్ డైరెక్ట్ తెలుగు సినిమాకు మ్యూజిక్ ఇస్తే సినిమా ఫ్లాప్ అవుతుంది అని కొత్త సెంటిమెంట్ ని తీసుకొచ్చారు.

Urvashi Rautela : ఏజెంట్ లో ఐటెం సాంగ్ కోసం మెగాస్టార్ భామ.. అటు రామ్ – బోయపాటి సినిమాలో కూడా..

అసలు చిత్రయూనిట్ అధికారికంగా AR రెహమాన్ పేరుని అనౌన్స్ చేయకముందే అభిమానులు ఇలాంటి సెంటిమెంట్ తీసుకురావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి బుచ్చిబాబు AR రెహమాన్ ని తీసుకుంటాడా? లేదా? ఒకవేళ తీసుకుంటే చరణ్ ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా చూడాలి.