RC16 : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్.. కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది!
రామ్ చరణ్ అభిమానులు కోసం అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చేశాడు. RC16 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి అప్డేట్ ఇస్తూ మాస్ పోస్టర్ రిలీజ్ చేశాడు.

Ram Charan gave update on RC16 title and first look poster
RC16 : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ (Game Changer) సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక మూవీకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. RC16 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అనౌన్స్‌మెంట్ తోనే ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. వ్రిద్ది సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
Ram Charan – Samantha : రామలక్ష్మికి చిట్టిబాబు ట్వీట్.. చాలా గర్వంగా ఉంది!
తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ ని, ఫస్ట్ లుక్ పోస్టర్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో సంకెళ్లు బ్రేక్ చేస్తున్నట్లు చేతులు కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్టర్ తో రాసిన ఒక కామెంట్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ”కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది” అంటూ పెట్టిన ట్యాగ్ లైన్ సినిమా పై ఆసక్తిని పెంచేస్తుంది. ఇక ఈ అప్డేట్ చరణ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.
Ram Charan: వంద కాదు షేర్ ఖాన్.. ఇప్పుడు వెయ్యి మందితో ‘గేమ్ చేంజర్’ వార్!
ఇక గేమ్ చెంజర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1200 మంది ఫైటర్స్ తో చరణ్ పోరాట సన్నివేశాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ మొదటిసారి ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Sometimes, Revolt becomes a necessity ❤️?
Title and First Look Update Soon…?@AlwaysRamCharan #RamCharanRevolts ?@BuchiBabuSana @SukumarWritings @MythriOfficial pic.twitter.com/GOU44Uo6df
— Vriddhi Cinemas (@Alwayz_No_1) May 5, 2023