Ram Charan : అమెరికా విమానం ఎక్కిన రామ్‌చ‌ర‌ణ్..

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌.

Ram Charan : అమెరికా విమానం ఎక్కిన రామ్‌చ‌ర‌ణ్..

Ram Charan going to USA for Game Changer Pre Release Event

Updated On : December 20, 2024 / 8:36 AM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ క‌థానాయిక. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 10న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర బృందం తెలియ‌జేసింది. డ‌ల్లాస్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో డిసెంబ‌ర్ 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్ కోసం రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు చిత్ర బృందం అమెరికా విమానం ఎక్కింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది.

Bachhala Malli : ‘బచ్చల మల్లి’ మూవీ రివ్యూ.. క్లైమాక్స్ లో అల్లరి నరేష్ ఏడిపించేశాడుగా..

అశ్విక ద‌శం బ‌య‌లుదేరింది. డిసెంబ‌ర్ 21న క‌ర్టిస్ క‌ల్వెల్ సెంట‌ర్‌లో గ్లోబ‌ల్ స్టార్‌ని క‌లిసేందుకు సిద్ధంగా ఉండండి. మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ర‌చ్చ చేద్దాం అంటూ రాసుకొచ్చింది.

Pushpa 2 collections : బాక్సాఫీస్ వ‌ద్ద పుష్ప రాజ్ రూల్‌.. 14 రోజుల్లో 1508 కోట్లు..

శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్, ఎస్ జే సూర్య కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.