Ram Charan: రామ్‌చరణ్ నిర్మాణంలో ఆ యువ హీరో సినిమా..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క సినిమాలను నిర్మిస్తున్నారు. చరణ్ తన చిన్ననాటి స్నేహితుడైన, యూవీ క్రియేషన్స్‌లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న విక్రమ్‌తో కలిసి 'వి మెగా పిక్చర్స్' అనే నిర్మాణ సంస్థని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

Ram Charan
Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క సినిమాలను నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని 2017లో ప్రారంభించాడు చరణ్. ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఆచార్య’, ‘గాడ్ పాదర్’ వంటి చిత్రాలను ఈ సంస్థ ద్వారా నిర్మించారు. అయితే.. ఇటీవల చరణ్ తన చిన్ననాటి స్నేహితుడైన, యూవీ క్రియేషన్స్‌లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న విక్రమ్‌తో కలిసి ‘వి మెగా పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ బ్యానర్ ద్వారా టాలీవుడ్‌లో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించనున్నట్లు ఆ సందర్భంగా ప్రకటించారు. తాజాగా ‘కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా సక్సెస్‌లు అందుకున్న అభిషేక్ అగర్వాల్ సంస్థతో కలిసి వి మెగా పిక్చర్స్ ఓ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఇండియన్ కంటెంట్‌ను గ్లోబల్ ఆడియన్స్‌కి పరిచయం చేసేలా ఓ ప్రాజెక్టును చేయబోతున్నారు. మే 28 ఆదివారం ఉదయం 11.11 గంటలకు ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రాబోతుందని అంటూ ఓ వీడియో, పోస్టర్ విడుదల చేశారు.
Ram Charan : పాన్ ఇండియా నిర్మాతలతో ప్రాజెక్ట్ చేయబోతున్న చరణ్.. గ్లోబల్ ఆడియన్స్ టార్గెట్!
దీంతో సినీ ప్రియుల్లో ఎక్కడ లేని అంచనాలు మొదలయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏంటి..? ఇందులో నటించబోయే హీరో ఎవరు..? అన్న దానిపై పలు ఊహాగానాలు వినపడుతున్నాయి. ఈ చిత్రంలో ‘కార్తికేయ2’ ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించనున్నాడని, ఈ సినిమాకి ‘ఇండియా గేట్’ అని పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. మరీ ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
The hero steering this tale and changing the course of history ❤️?
Any guesses?
Announcement tomorrow at 11.11 AM ?#RevolutionIsBrewing@AlwaysRamCharan @AbhishekOfficl @AAArtsOfficial pic.twitter.com/gzXvbedkuh
— V Mega Pictures (@VMegaPictures_) May 27, 2023
ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోండగా ఎస్‌జే సూర్య, నవీన్‌చంద్ర, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ తండ్రి, కొడుకుగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్‌లో కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తైనట్లు సమాచారం. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ జూన్ రెండో వారంలో మైసూర్‌లో మొదలుకానుంది.
Ram Charan : హాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్‌ని.. ఇండియా రావాలని కండిషన్ పెడతా.. రామ్‌చరణ్!