RC15 : కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర రామ్‌చరణ్ రాజకీయ సభ..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ డిఫరెంట్ లొకేషన్స్ లో జరగనున్నట్లు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ చార్మినార్ దగ్గర షూటింగ్ చేసిన శంకర్, ఈరోజు (ఫిబ్రవరి 10) కర్నూలులో ప్లాన్ చేశాడు. రాయలసీమకు చిహ్నమైన కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఈ షూటింగ్ జరుపుకుంటుంది.

RC15 at kurnool
RC15 : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. శంకర్ ఈ మూవీతో పాటు ఇండియన్-2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు. దీంతో RC15 షూటింగ్ కి బ్రేక్‌లు పడుతూ వస్తున్నాయి. తాజాగా శంకర్ మళ్ళీ ఈ మూవీ షూటింగ్ లో తిరిగి పాల్గొన్నాడు. నిన్న (ఫిబ్రవరి 9) మొదలైన ఈ కొత్త షెడ్యూల్ డిఫరెంట్ లొకేషన్స్ లో జరగనున్నట్లు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ చార్మినార్ దగ్గర షూటింగ్ చేసిన శంకర్, ఈరోజు (ఫిబ్రవరి 10) కర్నూలులో ప్లాన్ చేశాడు.
Ram Charan : కాన్సర్‌తో పోరాడుతున్న అభిమాని కోరికను తీర్చిన రామ్‌చరణ్..
రాయలసీమకు చిహ్నమైన కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఈ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లో రామ్ చరణ్, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. ఈ మూవీ రాజకీయం నేపథ్యంతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా కథనం ప్రకారం కొండారెడ్డి బురుజుకు అభ్యుదయం అనే రాజకీయ పార్టీ బ్యానర్ పెట్టి, ఒక రాజకీయ సభ సన్నివేశం షూట్ చేస్తున్నారు మూవీ టీం. ఇక షూటింగ్ విషయం తెలుసుకున్న అభిమానులు కొండారెడ్డి బురుజు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. షూటింగ్ సెట్ లోని చరణ్ ఫోటోలను సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేయగా, ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
కాగా ఈ సినిమాలో చరణ్ తండ్రి, కొడుకు రెండు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఒక పాత్రకి కియారా అద్వానీ, మరో పాత్రకి అంజలి హీరోయిన్లగా నటిస్తున్నారు. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ తప్ప ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. మర్చి 27 చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ అప్డేట్ వస్తుందా? లేదా? చూడాలి.