Ram Charan : జెండా వందనం చేసిన రామ్ చరణ్ కుమార్తె.. క్లీంకార ఫోటో చూశారా..?

మెగా వారసురాలు క్లీంకార తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు జరుపుకుంది. అమ్మమ్మ-తాతయ్యతో కలిసి జెండా వందనం చేసి..

Ram Charan : జెండా వందనం చేసిన రామ్ చరణ్ కుమార్తె.. క్లీంకార ఫోటో చూశారా..?

Ram Charan Upasana daughter Klin Kaara first flag hoisting Photos

Updated On : August 15, 2023 / 9:12 PM IST

Ram Charan : రామ్ చరణ్, ఉపాసన (Upasana) ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. తమ పెళ్ళైన 11 ఏళ్ళ తరువాత క్లీంకార (Klin Kaara) కు ఆహ్వానం పలికారు. ఇక ఈ వారసురాలితో ఇటు నాయనమ్మ-తాతయ్య (సురేఖ-చిరంజీవి), అటు అమ్మమ్మ-తాతయ్య (శోభన-అనిల్) సంతోష సమయం గడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, నేడు ఆగష్టు 15 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరు త్రివర్ణ జెండాని ఎగరవేసి స్వేచ్ఛ వాయువుని తీసుకుంటున్నారు.

Vishwak Sen : ఫ్యామిలీ ధమాకా.. దాస్ కా ఇలాకా.. టాలీవుడ్ ఫ్యామిలీస్‌తో విశ్వక్ సేన్ ఆట..

ఇక మెగా వారసురాలు కూడా తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పాల్గొంది. కేవలం పాల్గొనడమే కాదు ఆ త్రివర్ణ పతాకాన్ని తన చేతులతో ఎగరవేసింది. తన అమ్మమ్మ-తాతయ్యతో కలిసి జెండా వందనం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా చేశారు. “క్లీంకార ఫస్ట్ ఇండిపెండెన్స్ డే విత్ అమ్మమ్మ-తాతయ్య. అమూల్యమైన క్షణాలు” అంటూ రాసుకొచ్చారు.

ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చరణ్ అండ్ ఉపాసన ఇప్పటి వరకు క్లీంకార పేస్ ని రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఉపాసన షేర్ చేసిన ఫొటోల్లో క్లీంకార పేస్ కొంచెం కనబడుతుంది. ఇక ఇది చూసిన మెగా అభిమానులు లవ్ సింబల్స్ తో కామెంట్స్ బాక్స్ ని నింపేస్తున్నారు. మరి మీరు కూడా ఒకసారి ఆ పిక్స్ ని చూసేయండి.

Nayak : రామ్ చరణ్ ‘నాయక్’ సినిమా రీ రిలీజ్‌కి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

ఇక రామ్ చరణ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం గేమ్ చెంజర్ (Game Changer) షెడ్యూల్ జరుగుతుంది. నేడు కూడా దర్శకుడు శంకర్, చరణ్ పై ఒక కీలక సన్నివేశాన్ని తెరకెక్కించాడు. కాగా ఇవాళ ఈ చిత్రం నుంచి ఏమన్నా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు అనుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.