Ram Charan : పాప పుట్టాక మొదటిసారి మీడియా ముందు రామ్ చరణ్.. తన పోలికే అంటున్న చరణ్!
రామ్ చరణ్ అండ్ ఉపాసన తమ పాపతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మీడియాతో చరణ్ మాట్లాడుతూ.. నా పాప నా పోలికే అంటున్నాడు.

Ram Charan Upasana discharge from hospital with their baby girl
Ram Charan : రామ్ చరణ్, ఉపాసన ఇటీవల తమ లైఫ్ లోకి మెగా ప్రిన్సెస్ కి ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. జూన్ 20 తెల్లవారుజాము 1.49 నిమిషాలకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకి జన్మినిచ్చింది. ఇక ఉపాసన అండ్ పాప హెల్త్ గా ఉండడంతో నేడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తండ్రి అయిన తరువాత మొదటిసారి రామ్ చరణ్ మీడియా ముందుకు వచ్చాడు. ముందుగా తమ పాపని ఈ లోకంలోకి తీసుకు వచ్చిన డాక్టర్స్ కి థాంక్యూ చెప్పాడు చరణ్.
Chiranjeevi : చరణ్ కూతురు ఎంట్రీ.. మెగాస్టార్‌కు ఎంత మంది మనవరాళ్లో తెలుసా..?
ఇక తమ పాప పై ఇంతటి ప్రేమని చూపిస్తున్న శ్రేయోభిలాషులకు, బంధువులకు, స్నేహితులకు, ముఖ్యంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక పాపకి ఏమి పేరు పట్టారు అని ప్రశ్నించగా.. “ఇప్పటికే ఒక పేరు అనుకున్నట్లు, బారసాల రోజు నేనే ఆ పేరుని అనౌన్స్ చేస్తాను” అని తెలియజేశాడు. అలాగే పాపని చేతుల్లో తీసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారని ప్రశ్నించగా.. ప్రతి తండ్రి లాగానే తానూ ఎమోషనల్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. చివరిగా పాపకి ఎవరి పోలికలు వచ్చాయి అని అడగగా.. “కచ్చితంగా నా పోలికలే వస్తాయి” అంటూ వ్యాఖ్యానించాడు.
Chiranjeevi : చరణ్ కెరీర్‌లో ఎదుగుదల.. వరుణ్ ఎంగేజ్మెంట్.. పాప జాతకం వల్లే.. మీడియాతో చిరంజీవి!
కాగా మనవరాలు పుట్టిన విషయాన్ని చిరంజీవి మీడియాకి తెలియజేస్తూ.. పాప మంచి ఘడియల్లో పుట్టిందని, జాతకం కూడా అధ్బుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. “చరణ్ అండ్ ఉపాసన ఒక బిడ్డని మా చేతిలో పెడతారని ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు అది నిజమైంది. దీంతో మా కుటుంబమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు ఎంతో అపురూపం” అంటూ పేర్కొన్నాడు.